Ganja Queen Arrest: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో గంజాయి మాఫియాపై గురిపెట్టారు తెలంగాణ  ఈగిల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు. తొమ్మిదేళ్లుగా నానక్‌రామ్‌గూడ కేంద్రంగా మత్తు సామ్రాజ్యాన్ని నడుపుతున్న గంజాయి క్వీన్  కాలాపతి నీతూ బాయ్‌ను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషిన్లు, డిజిటల్ వేయింగ్ మెషిన్లను పెట్టుకుని రోజుకు ఏకంగా రూ.24 లక్షల విలువైన గంజాయి విక్రయాలు సాగించే ఈమె వ్యాపారం చూసి పోలీసులే షాకయ్యారు.   

Continues below advertisement

కుటుంబం మొత్తం గంజాయి దందా

నీతూ బాయ్ 2017 నుంచి కుటుంబ సమేతంగా గంజాయి అక్రమ రవాణా ,  విక్రయాల నెట్‌వర్క్‌ను నడుపుతోంది. గంజాయిని బల్క్‌గా కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి నానక్‌రామ్‌గూడ పరిసరాల్లోని ఐటీ ప్రొఫెషనల్స్, కాలేజీ స్టూడెంట్లకు విక్రయించేది. 2023లో స్కార్పియో వెహికల్‌లో 22 కేజీల గంజాయిని రవాణా చేస్తూ ఆమె కుమారుడు పోలీసులకు చిక్కాడు. గతంలో ఆమె కుటుంబంతో సంబంధం ఉన్న ఆపరేషన్లలో ఏకంగా  రూ.67 లక్షల నగదు, 51.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లేడీ డాన్ పై పదుల కేసుల 

ఈ లేడీ డాన్‌, ఆమె కుటుంబంపై 30కి పైగా గంజాయి, ఎక్సైజ్ కేసులు నమోదు కాగా,  ఆమె 13 కేసుల్లో దీర్ఘకాలంగా పరారీలో ఉంది. లంగర్ హౌస్‌లో రెండు G+3 భవనాలు, గచ్చిబౌలిలో G+2 భవనంతో పాటు పలు లగ్జరీ ఆస్తులను డ్రగ్ దందాతోనే సంపాదించింది. ఎన్నిసార్లు అరెస్టై జైలుకు వెళ్లినా బెయిల్‌తో బయటకు వచ్చి మళ్లీ అదే దందాను కొనసాగించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆమె ఇంటికి గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చే దాదాపు 50 మంది కస్టమర్లను కూడా పోలీసులు ఇదివరకే పట్టుకుని కేసులు నమోదు చేశారు.

Continues below advertisement

Also Read: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు  పోలీసులకు చిక్కకూడదనే ఎత్తులో నీతూ బాయ్ మొబైల్ ఫోన్లు వాడటమే మానేసి, తరచూ స్థావరాలను మారుస్తుంది. అయితే పక్కా ఇంటిలిజెన్స్‌ సమాచారంతో రంగంలోకి దిగిన ఈగిల్ ఫోర్స్ టీమ్, నవంబర్ 6న ఆమె మంగళ్‌హాట్ వైపు ఆటోరిక్షాలో ప్రయాణిస్తుండగా చుట్టుముట్టి అరెస్ట్ చేసింది.  Also Read: విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గుర్ని రక్షించిన లైప్ గార్డ్స్, ఇద్దరు గల్లంతు