Data Theft ED Case : వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఈడీ(ED) రంగంలోకి దిగింది. సైబారాబాద్ లో నమోదు అయినా ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. రక్షణ రంగానికి చెందిన పలువురు అధికారుల ఈ-మెయిల్స్, వాళ్లు పనిచేసే చోటు ఇతర వివరాల సైతం నిందితుల వద్ద ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు కోసం ఇచ్చిన డేటాను లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.  


ముఠా అరెస్ట్ 


 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో డేటా చోరీ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద రక్షణ రంగంతో పాటు, బ్యాంక్, పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డుదారుల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.  


ఆర్మీ అధికారుల ఈమెయిల్స్ కూడా 


జస్ట్ డయల్ ద్వారా డేటా అమ్మకానికి పెట్టినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు ఏజెన్సీల నుంచి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, మెయిల్ ఐడీ వివరాలు సేకరిస్తున్న ఈ ముఠా సేకరిస్తుంది. ఇలా సేకరించిన వివరాలను అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. లోన్స్ ఇచ్చే సంస్థలు ఈ డేటాను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. రక్షణ రంగానికి చెందిన అధికారుల ఫోన్ నెంబర్లు, వాళ్లు పనిచేసే ప్రాంతం, మెయిల్ ఐడీలు కూడా ఈ ముఠా అమ్మకానికి పెట్టింది. దీంతో ఆర్మీ అధికారులు సైబరాబాద్ పోలీసులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. తాజాగా ఈ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ అధికారులు పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈడీ అధికారులు కూడా నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  


వందల సంఖ్యలో కేసులు 


హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పలు ఆన్ లైన్ వెబ్ సైట్ల నుంచి ఈ డేటాను దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. పాన్ ఇండియా గవర్నమెంట్ ఉద్యోగుల డేటాతో పాటు పలు బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్ ల డేటా, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న ఆర్గనైజేషన్ ల నుండి డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. చోరీ చేసిన డేటానంతా పలువురు అక్రమార్కులకు అమ్ముకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం ఆరుగురు సభ్యులున్న ముఠాను అదుపులోకి తీసుకోగా.. నిందితులు నాగపూర్, ఢిల్లీ, ముంబై చెందిన వారిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు.