ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఎవరూ లేకపోవడంతో పలు అనుమానాలకు తావునిస్తోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ భవానిపురం వీకర్ సెక్షన్ కాలనీలో చెందిన బిస్సు కర్మ రాంజీ, పూజా దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. కర్మ రాంజీ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. వీరికి 12 సంవత్సరాలు వయసు కలిగిన కునాల్ అనే కుమారుడు ఉన్నాడు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో భార్య పూజ దేవి గుండెల్లో నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్లాలని భర్తకు ఫోన్ చేసింది. తాను రెడ్డి కాలనీలోని కమ్యూనిటీ హాల్ దగ్గర ఉంటానని చెప్పి రమ్మంది. పని ముగించుకొని అక్కడికి వచ్చిన భర్త రాంజీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
వీరు ఆస్పత్రికి వెళ్లిన పది నిమిషాల్లోనే పక్కింటికి చెందిన దావీదు ఫోన్ చేశాడు. మీ కుమారుడు కొనాల్ బట్టలు ఆరేసే తీగ చుట్టుకొని ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పాడు. దీంతో వారు దాగుటిన ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుని తీసుకొని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
అసలు బాలుడు ఒంటరిగా బట్టలు తీసేందుకు ఎందుకు వెళ్ళాడు? ఒక్కడే వెళ్లాలా లేక తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంట్లో ఇప్పటివరకు తమతో ఉన్న బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, సమీప బంధువులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు. బాలుని తమ వెంట తీసుకెళ్లిన ప్రాణం పోయేది కాదని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
విచారిస్తున్న పోలీసులు
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి పై పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతిచెందిన బాలుడిని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇందుకు సంబందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం రప్పించి తనిఖీలు చేపట్టారు. ఇంటి దగ్గర ఉన్న ఇరుగుపొరుగు వారిని, మృతుడి తల్లిదండ్రులను పోలీసులు మృతుని విచారణ చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
బట్టలు ఆరేసే తీగ మెడకు చుట్టుకొని ఎలా చనిపోతాడు అని అనుమానం కలుగుతుంది. తనకు తానే వేసుకున్నాడా? లేక ఎవరైనా మెడకు చుట్టారా అని అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిజాన్ని వెలికి తీయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆడుకున్న బాలుడు ఒకసారిగా మృతి చెందడంతో కాలనీవాసులు నిర్ధాంత పోయారు.