సికింద్రాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అనారోగ్యం కారణంగా తండ్రి మరణం తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈస్ట్ గోదావరి కి చెందిన సూర్యనారాయణ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజినీర్ గా పని చేస్తున్నట్లు గుండె కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ గత రెండు నెలల క్రితం మరణించినట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి మరణాన్ని తట్టుకోలేక భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఓల్డ్ బోయిన్ పల్లిలోని అద్దెకు ఉంటున్న ఇంట్లో వేరు వేరు గదుల్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త సూర్యనారాయణ మరణంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం ఏం చేయాలో తెలియని పరిస్థితులలో సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏప్రిల్ 4న భర్త సూర్యనారాయణ మరణించిన అనంతరం ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి విఫలం కాగా నిన్న రాత్రి వేరువేరు గదులలో ముగ్గురు ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాలను పోస్టుమార్టం గాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడి నుండి స్వస్థతలకు తరలించారు.