అన్వేషించండి

Hyderabad Kidnap: అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కలకలం - నిజమేనా? ప్రాంక్ వీడియోనా?

Mahindra Thar Kidnap: హైదరాబాద్‌ అత్తాపూర్‌లో జరిగిన కిడ్నాప్ హైడ్రామా సినీ ఫక్కీలో సాగడమే కాకుండా నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికీ ఆ యువతి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

Attapur Girl Kidnap Case: హైదరాబాద్‌ అర్ధరాత్రి వేళ ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్ ప్రధాన రహదారిపై నలుగురు యువకులు ఒక యువతిని బలవంతంగా కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఆసుపత్రిలోకి పరుగులు తీసినా వదలకుండా, సినిమాల్లో చూపించే విధంగా ఆమెను ఎత్తుకెళ్లిన తీరు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

 ఆసుపత్రిలోకి వెళ్లినా వదలని కిడ్నాపర్లు!   

మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు దుండగులు ఒక యువతిని లక్ష్యంగా చేసుకున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు సదరు యువతి ప్రాణభయంతో సమీపంలోని జాయ్ ఆసుపత్రి లోకి పరిగెత్తింది. అయితే, కిడ్నాపర్లు ఏమాత్రం జంకకుండా ఆసుపత్రి లోపలికే వెళ్లి ఆమెను ఈడ్చుకుంటూ బయటకు తీసుకువచ్చారు. నోరు మూసివేసి, బలవంతంగా కారులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.

 పోలీసుల ఛేజింగ్.. సినిమా సీన్‌ను మించి! 

స్థానికులు  డయల్ 100 కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిందితుల కారును పోలీసులు వెంటాడారు. అయితే, కిడ్నాపర్లు నడిపిన నెంబర్ ప్లేట్ లేని థార్ కారు అత్యంత వేగంగా వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను దాటుకుంటూ వెళ్లడంతో పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. పోలీసుల కళ్లుగప్పి దుండగులు చీకట్లోకి మాయమైపోయారు.

 బైక్‌పై అనుసరించిన వ్యక్తి ఎవరు? 

ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. కారు వెనుక ఒక బైక్ కూడా నిరంతరం ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాప్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు వాడుతున్న కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడం దర్యాప్తుకు సవాలుగా మారింది. కిడ్నాప్ అయిన యువతి ఎవరు? ఆమెకు ఈ నిందితులకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

 సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేట! 

రాజేంద్రనగర్ పోలీసులు ప్రస్తుతం జాయ్ ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలతో పాటు, అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న అన్ని కూడళ్లలోని ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. గతంలో ఆమెను ఎవరైనా వేధించారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. నగర నడిబొడ్డున పోలీసుల కళ్లుగప్పి కిడ్నాప్ జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కిడ్నాప్‌పై అందని ఫిర్యాదు

రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సదరు యువతి ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులతో మాట్లాడుతూ, తనను పికప్ చేసుకోవడానికి తన ప్రియుడి కుటుంబ సభ్యులు వస్తున్నారని చెప్పిందట. కారు  , ఆక్టివాపై వచ్చిన వ్యక్తులతో ఆమె స్వచ్ఛందంగానే వెళ్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు.  కిడ్నాప్ జరిగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చి సుమారు 12 గంటలు గడుస్తున్నా, సదరు యువతి కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ స్టేషన్‌కు వచ్చి ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు అందకపోయినప్పటికీ, ఆసుపత్రి నుంచి ఒక యువతిని అలా బలవంతంగా తీసుకువెళ్లడంపై పోలీసులు విచారణ ఆపలేదు. ఆ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో డీసీపీ నేతృత్వంలోని టీమ్స్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పరిసరాల్లోని సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.  ఇది కేవలం  ప్రాంక్ వీడియోనా? లేక నిజంగానే తెలిసిన వారి మధ్య జరిగిన గొడవా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandeep Manjargi Murder Case Belagavi: రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం మాజీ ఆర్మీ ఆఫీసర్‌ను హత్య చేసిన భార్య, ప్రియుడు! పంపకాల్లో తేడా రావడంతో ప్రియుడే బయట పెట్టేశాడు!
రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం మాజీ ఆర్మీ ఆఫీసర్‌ను హత్య చేసిన భార్య, ప్రియుడు! పంపకాల్లో తేడా రావడంతో ప్రియుడే బయట పెట్టేశాడు!
Instagram Live In Partner Killed: ప్రేమ గుడ్డిది - సోషల్ మీడియా ప్రేమ పిచ్చిది కూడా - ఇరవై ఏళ్లకే ఇన్‌స్టాగ్రామ్ లవ్.. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్.. చివరకు హత్య!
ప్రేమ గుడ్డిది - సోషల్ మీడియా ప్రేమ పిచ్చిది కూడా - ఇరవై ఏళ్లకే ఇన్‌స్టాగ్రామ్ లవ్.. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్.. చివరకు హత్య!
Nellore Crime News: మేం లేకుండా ఒంటరిగా బతకలేడు..! భార్య, కుమారుడికి ఉరివేసి రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య
మేం లేకుండా ఒంటరిగా బతకలేడు..! భార్య, కుమారుడికి ఉరివేసి రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
TG 20 Tournament Controversy:విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
Sai Krishna Missing Case:
"కొడుకు శవాన్ని అయినా చూపించండి" సాయికృష్ణ తల్లి వేడుకోలు! తీవ్ర ఒత్తిడి రావడంతో ప్రభుత్వం కీలక చర్యలు!
Neno Butterfly Song: విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
US Indo Pacific Command Name Change: ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్‌లో పీఓకే పాకిస్థాన్‌దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్‌లో పీఓకే పాకిస్థాన్‌దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
Embed widget