Mancherial Murder case: వివాహ బంధానికి విలువ ఇవ్వడం మానేశారు చాలా మంది. శారీరక వాంఛల కోసం... వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచిన వారు ఉండగానే... మరొకరితో  సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో కక్షలు పెరుగుతున్నాయి. హత్యలకు దారి తీస్తున్నాయి. ఇలా... ఇల్లీగన్‌ అఫైర్స్‌తో‌... ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్య, ప్రియుడు కలిసి భర్తను చంపేసిన సంఘటనలు కొన్ని  అయితే.... భార్యతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తిని భర్త చంపేసిన సంఘటనలు ఇంకొన్ని. ఇలా... తరచూ ఇలాంటి వార్తలు వింటూనే విన్నాం. మంచిర్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.


మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం కమ్మర్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఈనెల 13న (మంగళవారం) రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. భార్యతో వివాహేతర సంబంధం  పెట్టుకుని... అదే ఊర్లో కాపురం పెట్టిన వ్యక్తిని... అతి దారుణంగా చంపేశాడు. ఇందుకు అత్తమామల సహకారం కూడా తీసుకున్నాడు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు... నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి... వారిని కటకటాల  వెనక్కి పంపారు.


అసలు ఏం జరిగిందంటే..?
మంచిర్యాల జిల్లా పొన్నారం గ్రామానికి చెందిన 35 ఏళ్ల బట్టే శేఖర్‌-చెన్నూరు మండలం కమ్మరపల్లికి చెందిన 30ఏళ్ల పద్మ దంపతులు. కొన్నేళ్ల క్రితం వీరిని వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే... పద్మ బుద్ధి పెడదారి పట్టింది.  భర్త ఉండగానే... పొన్నారం గ్రామానికి చెందిన 29ఏళ్ల రామగిరి మహేందర్‌తో పరిచయం పెంచుకుంది. వారి పరిచయం... వివాహేతర సంబంధంగా మారింది. ఐదేళ్లుగా వీరి ఇల్లీగల్‌ అఫైర్‌ కొనసాగుతోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు  తెలియడంతో...  నాలుగు నెలల కింద ఇద్దరూ ఊరి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో చెన్నూరు పోలీసులు మిస్సింగ్ కేసు చేశారు. పోలీసులు ఆమె పట్టుకోగా... తన ఇష్టప్రకారమే వెళ్లిపోయానని చెప్పింది పద్మ. ఆ  తర్వాత... కొన్నిరోజులకు పద్మ-మహేందర్‌ తిరిగివచ్చారు. పొన్నారం గ్రామంలోనే ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. అయితే... నెల క్రితం పద్మ-మహేందర్‌ మధ్య గొడవ జరిగింది. దీంతో పద్మ కమ్మర్‌పల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. మహేందర్‌  అక్కడికి కూడా వెళ్లి గొడవ పడ్డాడు. ఈ విషయాని... పద్మ తల్లిదండ్రులు మొగిలి ఓదెలు, సుగుణక్క... ఆమె భర్త శేఖర్‌కు చెప్పారు. మహేందర్‌ అడ్డు తొలగించాలని కోరారు. అందరూ కలిసి మహేందర్‌ హత్యకు ప్లాన్‌ చేశారని పోలీసుల విచారణ  తేలింది.


ప్లాన్‌లో భాగంగా పద్మ... మహేందర్‌కు ఫోన్‌ చేసి తన పుట్టింటికి రావాలని పిలిచింది. దీంతో కమ్మరపల్లికి వెళ్లాడు మహేందర్‌. పద్మతోపాటు భర్త శేఖర్‌, ఆమె తల్లిదండ్రులు ఓదెలు, సుగుణక్క.. కర్రలతో మహేందర్‌ తలపై కొట్టి చంపారు. ఆ తర్వాత...  మృతదేహాన్ని ఎడ్లబండిపై గ్రామం శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ శవాన్ని తగబెట్టేశారు. అక్కడే ఉన్న యువకులు ఈ విషయాన్ని మహేందర్‌ అన్న రవీందర్‌కు చెప్పారు. రవీందర్‌ పోలీసులు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు  వెంటనే రంగంలోకి దిగారు. పారిపోయేందుకు చెన్నూరు బస్టాండ్‌కు వెళ్లిన శేఖర్‌, పద్మ, ఓదెలు, సుగుణక్కను అరెస్ట్‌ చేశారు. నలుగురిని రిమాండ్‌కు తరలించారు.