Tenali Crime : గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెనాలి గాంధీ నగర్ గంటా వారి వీధిలో భార్యను కిరాతకంగా హత్య చేశాడు భర్త.   కాకర్ల స్వాతి, కోటేశ్వరరావులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని కొద్దీ రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు భర్త కోటేశ్వరరావు. ఈ విషయంపై తరచూ గొడవపడేవాడు. స్వాతి స్థానికంగా బ్యూటీ పార్లర్ నడుపుతోంది. గురువారం బ్యూటీ పార్లర్ షాప్ లో స్వాతి ఉండగా కోటేశ్వరరావు కత్తితో దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో స్వాతి అక్కడికక్కడే కుప్పకూలింది.  అనంతరం ఆమె మృతదేహానికి రెండు దండలు వేసి నివాళి అర్పించాడు. తర్వాత తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు కోటేశ్వరరావు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యకు ఫ్లాన్ చేసిన కోటేశ్వరరావు వస్తూ రెండు పూల దండలు తీసుకువచ్చి చంపిన తరువాత స్వాతి మృతదేహంపై వేశాడు.  


అసలేం జరిగింది? 


కాకర్ల కోటేశ్వరరావు, స్వాతిలకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. స్వాతి తెనాలిలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంది. కోటేశ్వరరావు అప్పులు చేయడం మొదలపెట్టాడు. పెళ్లి సమయంలో భార్య పుట్టింటి నుంచి సంక్రమించిన స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని స్వాతిపై ఒత్తిడి తెచ్చాడు. నెలరోజులు క్రితం స్వాతికి, కోటేశ్వరరావుకు మధ్య గొడవ జరిగింది. దీంతో స్వాతి పుట్టింటికి వెళ్లింది. తిరిగి కొన్ని రోజుల తర్వాత అత్తింటికి తిరిగి వచ్చింది. మంగళవారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. స్వాతిపై కోటేశ్వరరావు దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బ్యూటీ పార్లర్ ​లో స్వాతి ఒంటరిగా ఉందని తెలుసుకుని కత్తితో దాడికి పాల్పడ్డాడు. పథకం ప్రకారమే భార్యపై కత్తితో దాడి చేసి మెడ మీద వేటువేశాడు. ఆమె మరణించిందని నిర్ధారించుకుని స్థానిక  పోలీస్ స్టేషన్ లో ​లో లొంగిపోయాడు కోటేశ్వరరావు. 


అనంతపురంలో మరో దారుణం 


అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం జరిగింది. కామర్స్ లెక్చరర్ సుమంగళిపై భర్త కత్తితో దాడి చేశాడు. ప్రిన్సిపల్ రూమ్‌లో తంబ్ వేసి వస్తుండగా కత్తితో గొంతు కోశాడు భర్త పరేష్. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు చూస్తుండగానే లెక్చరర్‌పై ఆమె భర్త దాడి చేశాడు. చంపేందుకు యత్నించి విఫలమయ్యారు. ఉదయాన్నే కాలేజీ వచ్చిన సుమంగళి... ప్రిన్సిపల్ రూమ్‌కి వెళ్లి హాజరు వేసుకొని వచ్చారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న ఆమె భర్త పరేష్‌.. ఒక్కసారిగా దాడి చేశాడు. దాడి విషయం తెలుసుకొని తేరుకునే లోపు పరేష్‌... ఆమె మెడపై వేటు వేశాడు. తీవ్ర రక్తస్రవంతో అక్కడే పడిపోయారమే. దీన్ని చూసిన విద్యార్థులు.. పరేష్‌ను అడ్డుకోవడానికి యత్నించారు. వాళ్లంతా వస్తున్న సంగతి తెలుసుకొని అతను అక్కడి నుంచి పరారయ్యాడు. గాయంతో రక్తపు మడుగులో పడి ఉన్న సుమంగళిని విద్యార్థులు, కాలేజీ స్టాఫ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణభయం లేదని వైద్యులు చెప్పారు. 


అనుమానం కారణంగానే 


సుమంగళి, పరేష్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఏడాది క్రితం బదిలీపై సుమంగళి ఈ ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు. అంతకు ముందు ఇరవై ఏళ్లపాటు గుంటూరులో ఆమె పని చేశారు. అనంతపురం వచ్చిన తర్వాత శ్రీనివాస్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా పరేష్‌తో విడిగా ఉంటున్నారు. అనుమానం కారణంగానే సుమంగళిపై పరేష్‌ దాడి చేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థులు, స్థానికుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పరేష్‌ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.