Jogi Ramesh Latest News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు నమోదు అయ్యింది. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో జోగి రమేష్ కుటుంబ సభ్యులపై జోగి  రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు చేశారు. మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు. 

Continues below advertisement

జోగి రమేష్‌ కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదులో మొత్తం 11 మంది తనను హింసిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో జోగి రమేష్, ఆయన భార్య జోగి శకుంతల, కుమారుడు జోగి రాజీవ్, ప్రియాంక, జోగి రమేష్ తమ్ముడు జోగి రాము, జోగు రాము కొడుకులు పండు, రాకేష్ ఉన్నారు. 

Continues below advertisement

326/26 నెంబర్‌తో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. కోడలి ఫిర్యాదుతో సెక్షన్ 85, 318,109 క్లాస్ వన్,420,318, 3&4 DP కింద కేసు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.