Five youths drowned in Godavari river |  తాళ్లపూడి: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం గోదావరిలోకి స్నానానికి దిగిన యువకులు గల్లంతయ్యారు. తాళ్లపూడి మండలం తాడిపూడిలో గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయిన ఐదుగురు యువకులు మృతిచెందారు.  పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థానానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో యువకుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డి.ఎస్.పి దేవకుమార్ సైతం అక్కడికి చేరుకున్నారు. పండుగనాడు నదీ స్నానానికి విషాదం చోటుచేసుకోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు అకాల మరణం చెందడాన్ని వారి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

గోదావరిలో నదీ స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు తిరుమల శెట్టి పవన్ (20), పడాల సాయి (19), గర్రె ఆకాష్ ( 19),పడాల దుర్గాప్రసాద్ ( 19)అనిశెట్టి పవన్ (19)

శ్రీశైలంలో తండ్రీకొడుకులు మృతి

మహాశివరాత్రి అంటే శ్రీశైలానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన తండ్రి, కొడుకు పాతాళగంగలో స్నానానికి వెళ్లగా విషాదం చోటుచేసుకుంది. పాతాళగంగలో ముగినిపోయి ఇద్దరు చనిపోయారు.

ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు టీనేజర్లు మృతి

పల్నాడు జిల్లాలో మహాశివరాత్రి రోజున విషాదం జరిగింది. సత్తెనపల్లి పట్టణంలోని సాయికృష్ణ థియేటర్ వద్ద ట్రాక్టర్ ను బైకు ఢీకొనడంతో  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు టీనేజర్లు మృతిచెందారు. మృతులను వడ్డవల్లికి చెందిన తోట సంతోష్ (18), నిఖిత్ (13)లుగా గుర్తించారు.

Also Read: Son Kills Father: తండ్రి పాలిట యముడిగా మారిన కొడుకు, కత్తితో పొడిచి హైదరాబాద్ ఘటన తరహాలోనే దారుణహత్య