Female Teacher Crime: మహిళా టీచర్లు విద్యార్థులతో  లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, మైనర్లు అని చూడకుండా మగ విద్యార్థులకు డ్రగ్స్, మద్యం ఇచ్చి వారితో లైంగిక సుఖం పొందడం వంటివి విదేశాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముంబైలో ప్లస్ వన్ విద్యార్థిని తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసినందుకు 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు.
 
వివాహితురాలు,  పిల్లలు ఉన్న ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఒక సంవత్సరం పాటు విద్యార్థినిపై  లైంగిక దాడి చేసిందని ఆరోపణలు ఉన్నాయి. 2023లో హైస్కూల్ వార్షిక వేడుక కోసం డ్యాన్స్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆ  సమయంలో విద్యార్థులను పోటీలకు రెడీ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు 11వ తరగతి విద్యార్థి పట్ల ఆకర్షితురాలైంది. వివిధ రకాలుగా ఆ విద్యార్థిని లేడీ టీచర్ ట్రాప్ చేసింది. జనవరి 2024లో మొదటి సారి ఆ బాలుడిపై లైంగిక దాడి జరిపింది.  మొదటి లైంగిక సంబంధం తర్వాత ఆ బాలుడు ఆమెను తప్పించుకోవండం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత ఉపాధ్యాయురాలు తన మహిళా స్నేహితురాళ్లలో ఒకరిని మధ్యవర్తిగా పెట్టుకుంది.  పెద్ద  మహిళలు,  టీనేజ్ అబ్బాయిల మధ్య సంబంధాలు "సాధారణం" అని విద్యార్థిని ఒప్పించమని  ఒత్తిడి చేసింది. 

Continues below advertisement


ఈ టీచర్ ఫ్రెండ్ కూడా ఆ విద్యార్థికి బ్రెయిన్ వాష్ చేసింది. టీచర్ నీ కోసమే పుట్టారని..  తియ్యటి మాటలు మైనర్ విద్యార్థికి చెప్పింది. దాంతో ఆ విద్యార్థి  టీచర్ ని కలవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి   ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పి లైంగిక దాడి చేసేదని  పోలీసులు తెలిపారు. తరువాతి కొన్ని రోజుల్లో విద్యార్థి తీవ్ర ఆందోళన చెందడంతో, ఆమె అతనికి కొన్ని యాంటీ-యాంగ్జైటీ మాత్రలు కూడా ఇచ్చింది. 



ఆ తర్వాత  టీచర్ .. ఆ విద్యార్థిని దక్షిణ ముంబైలోని వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లకు ,  విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకెళ్లడం ప్రారంభింది.  ఆ మైనర్ విద్యార్థికి మద్యం  తాగించి లైంగిక అవసరాలు తీర్చుకునేది విషయం బయటపడటంతో  టీచర్ ని  పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వరకు పోలీసు కస్టడీకి తరలించారు. టీచర్ ఫ్రెండ్ పరారీలో ఉన్నారు. ఆమె కోసం గాలిస్తున్నారు. 


ఇప్పటి వరకూ స్కూళ్లలో  అమ్మాయిలపై మగ టీచర్లు వికృతాలకు పాల్పడుతున్న ఫిర్యాదులు వచ్చేవి . ఇప్పుడు మహిళా టీచర్లు మగ పిల్లలపై చేస్తున్న ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి.