నకిలీ హిజ్రాల ముఠా జూబ్లీహిల్స్‌లో వాహనదారులను అడ్డుకుని డబ్బులు వసూలు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన యూట్యూబర్ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Fake Hijra Gang Arrested: హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ కారును అడ్డగించి బలవంతపు వసూళ్లు.. ఫేక్ హిజ్రాల గ్యాంగ్ అరెస్ట్!
Fake Hijra Gang Arrested: హైదరాబాద్‌లో నకిలీ హిజ్రా గ్యాంగును పోలీసులు అరెస్టు చేశారు. బలవంతపు వసూల్లకు పాల్పడుతున్న ఈ ఫేక్ గ్యాంగులో అందరూ పురుషులే కావడం విశేషం.

- జూబ్లీహిల్స్‌లో నకిలీ హిజ్రాలు డబ్బు వసూలు చేస్తూ సంచలనం సృష్టించారు.
- పోలీసులు నెలరోజుల దర్యాప్తుతో బోడుప్పల్లో నలుగురిని పట్టుకున్నారు.
- పట్టుబడినవారు హిజ్రాల వేషంలో ఉన్న పురుషులుగా విచారణలో తేలింది.
- నిందితులు గతంలోనూ బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడైంది.
Fake Hijra Gang Arrested: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన నకిలీ హిజ్రాల వసూళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. హిజ్రాల వేషంలో రోడ్లపై వాహనదారులను అడ్డుకుంటూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని 'ట్రూ బ్లాక్ కాఫీ' కేఫ్‌కు ఓ యువకుడు తన కొత్త బీఎండబ్ల్యూ (BMW) కారులో వచ్చాడు. కాఫీ తాగి తిరిగి వెళ్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు హిజ్రాల వేషధారణలో వచ్చి అతని కారును అడ్డుకున్నారు. కొత్త కారు కొన్నారంటూ రూ. 5,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న ఓ యూట్యూబర్ ఈ తతంగాన్ని తన కెమెరాలో బంధించి 'ఎక్స్' లో పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వైరల్ అయింది.
పోలీసుల నిఘా
ఈ ఘటనపై స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్ వెంటనే విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం జూబ్లీహిల్స్ నుంచి బోడుప్పల్ వరకు సుమారు 500కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను దాదాపు నెల రోజుల పాటు పరిశీలించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో బోడుప్పల్ ప్రాంతంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: విజయవాడలో దారుణం.. ప్రియురాలిపై ప్రేమోన్మాది కత్తితో దాడి, ఆపై ఆ*త్మహత్య
అసలు నిందితులు వీళ్లే?
పోలీసులు విచారించగా .. పట్టుబడిన నలుగురు వ్యక్తులు నిజమైన హిజ్రాలు కాదని, మగవారే హిజ్రాల వేషధారణ ధరించి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితులను రమేష్ (40), సత్యనారాయణ (41), రమేష్ (42), యాదగిరి (44)లుగా గుర్తించారు. వీరంతా బోడుప్పల్‌లోని కాకతీయ కాలువనగర్ లో ఉంటున్నారు. ఈ ముఠా గత కొంతకాలంగా ఇదే విధంగా రోడ్లపై ప్రజలను అడ్డుకోవడం, కొత్తగా ప్రారంభించిన షాపులు, గృహప్రవేశాల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జూబ్లీహిల్స్ అదనపు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇలాంటి బలవంతపు వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Also Read: అనంతగిరి ఘాట్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురు మృతితో తీవ్ర విషాదం
Frequently Asked Questions
జూబ్లీహిల్స్‌లో ఇటీవల చోటుచేసుకున్న సంచలన ఘటన ఏమిటి?
ఈ ఘటనలో అరెస్టయిన నకిలీ హిజ్రాలు ఎవరు?
రమేష్ (40), సత్యనారాయణ (41), రమేష్ (42), యాదగిరి (44) అనే నలుగురు వ్యక్తులు హిజ్రాల వేషధారణలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ అరెస్టు అయ్యారు. వీరు బోడుప్పల్‌కు చెందిన మగవారు.
పోలీసులు ఈ ముఠాను ఎలా పట్టుకున్నారు?
బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు నెల రోజుల పాటు 500కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి బోడుప్పల్ ప్రాంతంలో నిందితులను పట్టుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















