Eluru thief Arrest: వీధిలో గుండు సూది దొంగతనం  జరిగినా ఎవరు చేశారో రికార్డు పోలీసుల వద్ద ఉంటుంది. వాళ్లు పట్టుకోవాలనుకుంటే వాళ్లను ఎక్కడున్నా పట్టుకొచ్చేస్తారు. వారికి తీరిక లేక కొంత మంది దొంగల్ని పట్టుకోరు. ఇదేదో తమ ఘనత అనుకున ఓ దొంగ.. పోలీసులకు తాను ఎక్కడున్నారో తెలియదని  అనుకున్నాడు. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.

Continues below advertisement

"నేను 100 బైకులు, స్కూటర్లు దొంగతనం చేశా.. దమ్ముంటే పట్టుకోండి" అంటూ  వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో వైరల్ అయింది.   నెటిజన్లు "పోలీసులు పట్టుకుంటారా?" అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ, ఏలూరు పోలీసులు 'ఆపరేషన్ హంట్' పేరుతో రంగంలోకి దిగి, ఆ దొంగతో పాటు అతడి ముఠాలోని ఐదుగురు నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. వారి వద్ద నుంచి , 12 వాహనాలు  స్వాధీనం చేసుకున్నారు.                      

  ఏలూరు, తిరువూరు, ఆగిరిపల్లి, నూజివీడు  పల్లె ప్రాంతాల్లో సీసీటీవీలు లేకపోవడంతో దొంగలు సులభంగా బైకుల్ని దొంగతనం  చేస్తున్నారు.   పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, ఒక్కడి కాదు గ్యాంగ్ చేతిలో ఈ చోరీలు జరుగుతున్నాయని తేల్చారు. ఈ బైకుల దొంగల కోసం పోలీసులు వెదుకుతున్న సమయంలో ఒక దొంగ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. "నేను 100 బైకులు కొట్టేశా.. పోలీసులు పట్టుకోగలరా?" అంటూ పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

Continues below advertisement

పాత కాలంలో ఇలాంటి కేసులు పోలీసులకు కష్టమే అయ్యేవి. మొబైల్‌లు, సోషల్ మీడియా లేకపోతే ఆధారాలు దొరకకపోయేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీతో పోలీసులు సులభంగా కేసులు సాల్వ్ చేస్తున్నారు.  వీడియో వైరల్ అవ్వడంతో ఏలూరు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. నూజివీడు టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. సత్య శ్రీనివాస్ అధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేశారు. జిల్లాలోని బైక్ చోరీ కేసులను పరిశీలించి, సీసీటీవీ ఫుటేజ్‌లను చెక్ చేశారు. పల్లె ప్రాంతాల్లో కెమెరాలు లేకపోవడం సవాలుగా ఉన్నా, టెక్నాలజీ , డిటెక్టివ్ వర్క్ మిక్స్ చేసి దర్యాప్తు చేశారు.

దర్యాప్తులో ఒక క్లూ ద్వారా ఈ చోరీలు ఒక్కడి చేత కాదు, గ్యాంగ్ చేత జరుగుతున్నాయని తేలింది. పక్కా ప్లాన్‌తో పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారిలో ఆ సవాలు విసిరిన దొంగ కూడా ఉన్నాడు. నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు.  పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 బైకులు, స్కూటర్ల విలువ రూ.9.08 లక్షలు. ఈ ఆపరేషన్ నూజివీడు ఎస్‌డీపీఓ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో విజయవంతమైంది. నిందితులు ఏలూరు, తిరువూరు, ఆగిరిపల్లి, నూజివీడు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు.       

పోలీసులు పోస్ట్ చేసిన వీడియోపై నారా లోకేష్ కూడా స్పందించారు.