NRI arrest in US: అమెరికాలో భార్యపై వేధింపులు - కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్ అరెస్టు
Tirupati NRI : భార్యపై వేధింపులకు పాల్పడుతున్న తిరుపతి ఎన్నారైని కాలిఫోర్నియా పోలీసులు అరెస్టుచేశారు. ఆయన కోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించారు.

Tirupati NRI Jeswanth Manikonda arrested: అమెరికాలో భారతీయ కమ్యూనిటీలో మరోసారి గృహ హింస సంఘటన చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MPD) అధికారులు, సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం సమన్వయంతో NRI జెస్వంత్ మనికొండ (36)ను గృహ హింస , కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వును ఉల్లంఘించిన ఆరోపణలపై అరెస్టు చేశారు. కేసు ప్రస్తుతం సుపీరియర్ కోర్టులో ఉంది.
గతంలో భార్యను వేధించవద్దని.. కోర్టు ఉత్తర్వులు
పోలీసు నివేదికల ప్రకారం, జెస్వంత్ మనికొండ తన భార్యపై శారీరక హింసకు పాల్పడ్డాడు. ఆమె జీవితానికి ముప్పు కలిగించాడు. బాధితురాలిపై మిల్పిటాస్‌లోని వారి నివాసంలో ఈ దాడి జరిగింది. ఈ సంఘటనకు ముందు, బాధితురాలు సుపీరియర్ కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వు (ప్రొటెక్టివ్ ఆర్డర్) పొందింది, దీని ప్రకారం జెస్వంత్ ఆమెతో సంప్రదింపులు జరపడం లేదా సమీపంలో ఉండకూడదు. అయినప్పటికీ, ఆయన ఈ ఆర్డర్‌ను ఉల్లంఘించి, మరోసారి ఆమెను వేధించినట్లు పోలీసులు నమోదు చేశారు.
కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి మరోసారి దాడి చేసిన జశ్వంత్
"ఈ అరెస్టు సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం సహకారంతో జరిగింది. గృహ హింస కేసుల్లో మేము ఎలాంటి కసురాగా ఉండరు. బాధితుల రక్షణ మా ప్రధాన లక్ష్యం" అని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటించిదంి. అరెస్ట్ వెంటనే జెస్వంత్‌ను సాంటా క్లారా కౌంటీ మెయిన్ జైలుకు తరలించారు. తర్వాత ఎల్మ్‌వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. బెయిల్ మంజూరైన తర్వాత ఆయన విడుదలయ్యారు, కానీ ప్రారంభ హాజరు విచారణ ఇంకా పెండింగ్‌గా ఉంది.
అరెస్ట్ తర్వాత బెయిల్ పై విడుదల -త్వరలో ట్రయల్
కోర్టు పత్రాలు, పోలీసు నివేదికలు , అఫిడవిట్స్ ఆధారంగా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. జెస్వంత్ మీద జీవిత భాగస్వామి లేదా సహవాసిపై శారీరక గాయాన్ని కలిగించడం కిందకేసు పెట్టారు. ఇది సీరియస్ క్రైమ్ గా భావిస్తారు. శిక్షగా 2-4 సంవత్సరాలు జైలు లేదా ఫైన్‌లు ఉండవచ్చు. కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వును (ప్రొటెక్టివ్ ఆర్డర్) ఉల్లంఘించడంపై మరో కేసు నమోదు అయింది. ఈ కేసులో శిక్షగా 1 సంవత్సరం జైలు లేదా ఫైన్ (గరిష్టంగా $1,000) ఉండవచ్చు.
భారతీయ అమెరికన్ కమ్యూనిటీ సర్వేల ప్రకారం, యూఎస్‌లో 10% భారతీయ మహిళలు గృహ హింస బాధితులు. కానీ చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు.





















