Sweeti Couple : ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చాక చాలా పనులు సులువుగా జరగడమే కాకుండా అనంతకోటి దరిద్రాలు కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో ఇది ఒకటి. ఓ జంట సులువుగా డబ్బులు సంపాదించాడనికి సులువైన మార్గం ఎంచుకున్నారు. తాము రోజూ రాత్రి చేసుకునే శృంగారాన్ని అందరూ చూసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఉచితంగా కాదు. కాస్త ఖరీదు కట్టి చూపిస్తున్నారు.
ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారా అని కొంత మంది ఆశ్చర్యపోయేలా ఈ జంట చేశారు. క్యాబ్ డ్రైవర్ గా పని చేసే వ్యక్తి.. తన భార్యతో కలిసి ..లైవ్ శృంగారాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. హైదరాబాద్ అంబర్ పేటలో తన ఇంట్లోనే హెడ్ డీ కేమెరాలతో లైవ్ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆన్ లైన్ లో లైవ్ లో తమ శృంగారాన్ని చూడాలనుకుంటున్న వారు డబ్బులు పంపితే లింక్ పంపిస్తారు. చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కో లింక్ కు రెండు వేలు వసూలు చేస్తున్నారు.
క్యాబ్ డ్రైవర్ కు డ్రైవింగ్ చేసి చిరాకేసిందేమో కానీ.. చివరికి ఈ పని ప్రారంభించాడు. ఇదొక్కటే కాదు.. వారి శృంగార వీడియోలను అమ్మడం.. శృంగార చాట్ సౌకర్యాలను కూడా అందిస్తున్నారు. నాలుగు నెలలుగా వీరి బిజినెస్ పెరిగిపోయింది. లింక్ రెండు వేలకు చొప్పున అమ్ముతున్నారు. ఇలాంటి లింకుల్ని కొనుగోలు చేసి చూసేవారు ఎక్కవైపోయారు.
ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు చేరింది. చివరికి పోలీసులు రెయిడ్ చేశారు. పట్టుకున్నారు. కానీ అదేమంత పెద్ద నేరం కాదు. రేపు బయటకు వచ్చి మళ్లీ అదే చేసుకుంటారు. ఈ జంట బరితెగింపు సమాజాన్ని ఆశ్చర్య పురస్తోంది. నిజానికి ఇలాంటి లైవ్ సర్వీసుల్ అందించే యాప్స్ ఉంటాయి. వాటి సంగతి ఈ జంటకు తెలియదేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మారుతున్న సమాజంలో.. డబ్బు సంపాదన కోసం ఎలాంటి పనులు అయినా చేయడానికి కొంత మంది సిద్ధపడుతున్నారని ఇలాంటి వారిని పట్టుకున్నప్పుడు అందరూ భావిస్తున్నారు.
ఇంటర్నెట్ లో యూట్యూబ్ వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించేవారు వారు ఉంటారు. విదేశాల్లో ఇలా జంటలు లేదా మహిళలు.. తమ ప్రైవేటు వ్యవహారాలను.. బెడ్ రూం పనుల్ని ప్రైవేటుగా అమ్మకానికి పెట్టి వ్యాపారం చేస్తూంటారు. మన దేశంలో అలాంటి సంస్కృతి లేదు.కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోని వెబ్ సైట్లతో ఒప్పందాలు చేసుకుని ఇలాంటి శృంగార వీడియోలు తీసేందుకు స్టూడియోలు కూడా ఏర్పా టు చేస్తున్న ఘటనలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట అనంతపురం జిల్లాలోనూ పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారు. ఇప్పుడీ జంట స్వతంత్రంగా తమ వ్యాపారాన్ని ఇలా చేస్తూ దొరికిపోయారు. అయితే వారిపై ఐటీ చట్టం ప్రకారం మాత్రమే కేసులు పెట్టగలరని న్యాయనిపుణులు చెబుతున్నారు.