అక్రమ సంబంధాలు పచ్చనికాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. సుఖంగా సాగే దాంపత్య జీవితంలో వివాహేతర సంబంధాలు రక్తపు మడుగులు అవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. భర్త వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక అతడ్ని హత్య చేసి తలతో పోలీసుస్టేషన్ లో లొంగిపోయిందో మహిళ. ఇవాళ ఒంగోలులో భార్య వివాహేత సంబంధం పెట్టుకుందని ఆ యువకుడిపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. 


భార్యభర్తల దాంపత్య జీవితం అంటే అన్యోన్యతకు నిదర్శనం. నిండు నూరేళ్లు ఒకరికి ఒకరు తోడూ నీడగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాన్ని పాడుచేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త చూశాడని, ప్రియుడితో కలిసి భర్తను చితకబాది మహిళ పరారైంది. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం వంకరవారిపల్లి గ్రామంలో గణేష్, నందినిలు గత కొద్ది ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వీళ్లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది. గణేష్ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్నాళ్లు చక్కగా సాగిన వీరి కాపురంలో కలతలు వచ్చాయి. గణేష్ కూలీ పనుల కోసం బయట ప్రాంతాలకు వెళ్లి వచ్చేవాడు. 


Also Read: భర్తను చంపి తలను సంచిలో పెట్టుకున్న భార్య.. వెంటనే ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లిందంటే..!


ప్రియుడితో కలిసి భర్తపై దాడి 


ఈ సమయంలోనే నందినికి అదే గ్రామంలో ఉన్న రెడప్ప అనే‌ యువకుడితో పరిచయం ఏర్పడింది. రెడప్ప డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉండేవాడు. వీరి స్నేహం వివాహేతర సంబంధంగా మారింది. గణేష్ ఇంటిలో లేని సమయంలో రెడప్ప ఇంటికి వచ్చేవాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్లు గణేష్ కు తెలిపారు. దీంతో భార్య నందిని ప్రవర్తన మార్చుకోవాలని గణేష్ మందలించాడు. సరే అని భర్తతో చెప్పిన ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన గణేష్.. నందిని నిలదీసేందుకు ఒకరోజు సడెన్ గా ఇంటికి వచ్చాడు. ఇంట్లో నందిని లేకపోయే సరికి గ్రామమంతా గాలించాడు. కానీ నందిని ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. గ్రామస్తులను నందిని ఆచూకీ అడుగగా వారు ఇచ్చిన సమాచారంతో తుంబకుప్పం గ్రామానికి చెందిన ఓ రైతు మామిడి తోట వద్దకు వెళ్లాడు. మామిడి తోటలో ప్రియుడితో తన భార్యను చూసి షాకయ్యాడు. కోపంతో రెడ్డప్పపై దాడికి దిగాడు. నందిని, రెడ్డప్ప కలిసి గణేష్ ను ఓ చెట్టుకు కట్టేసి దాడిచేశారు. తీవ్ర రక్తపు మడుగులో గణేష్ సృహ కోల్పోయాడు. దీంతో అక్కడి నుంచి రెడప్ప, నందినిలు పరారయ్యారు. అయితే మామిడి తోపులో పనిచేస్తున్న కూలీలు గణేష్ ను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నందిని, రెడప్పల కోసం గాలిస్తున్నారు.


Also Read: ఒంగోలులో దారుణం... పట్టపగలే యువకుడిపై కత్తితో దాడి... అక్రమ సంబంధమే కారణమా...?