CBI Arrests Punjab IPS Officer Harcharan Singh Bhullar: ఐపీఎస్ అధికారులు లంచగొండులను అరెస్టు చేయాలి. కానీ వారే లంచాలు తీసుకుంటే..సీబీఐ అరెస్టు చేస్తుంది. ఇప్పుడు పంజాబ్ లో అదే జరిగింది. కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) పంజాబ్ కేడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి హర్చరన్ సింగ్ భుల్లార్‌ను ₹5 కోట్ల లంచం కేసులో అరెస్టు చేసింది. 2009 బ్యాచ్ IPS అధికారి , రోపర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG)గా పనిచేస్తున్న భుల్లార్‌ను చండీగఢ్‌లోని తన కార్యాలయంలోనే సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా ప్టటుకుంది. ఓ కేసును మూసివేయడానికి భుల్లార్ ఐదు కోట్ల లంచం అడిగారు.
ఒక వ్యక్తి తన మీద నమోదైన FIRను ముగించడానికి మధ్యవర్తి ద్వారా లంచం డిమాండ్ చేశారని సీబీఐకి ఫఇర్యాదు చేశారు. ట్రాప్ చేసి డబ్బులు ఇచ్చే రోజున పట్టుకున్నారు. సీబీఐ దాడుల్లో భుల్లార్ ఇళ్లు, కార్యాలయాల నుంచి ₹5 కోట్లకు పైగా లెక్కల్లో లేని నగదు, కేజీన్నర బరువున్న బంగారం చైనా స్వాధీనం చేసుకున్నారు. అలాగే పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లగ్జరీ ఐటమ్స్, ఆయుధాలు కూడా పట్టుకున్నారు. హర్చరన్ సింగ్ భుల్లార్ (2009 బ్యాచ్ IPS, ఒక మధ్యవర్తిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఈ అరెస్టు పంజాబ్ పోలీస్ శాఖలో పెరిగిపోయిన అవినీతికి సాక్ష్యంగా మారింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వెలుగులు బయటపడవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.