హైదరాబాద్ నిజాంపేట్‌లోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీ అనే ఓ కేకులు తయారు చేసే గోదాంలో రైడ్‌ చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌లు తయారు చేస్తున్నట్టు తేలింది. రసాయన కెమికల్స్‌తో కేకులు తయారుచేసి విక్రయిస్తున్నారు ఇక్కడ కేటుగాళ్లు.   వారి గోదాంపై బాలానగర్ ఎస్వోటి పోలీసులు దాడి చేసి సయ్యద్ వాసిఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు యజమాని గోపాలకృష్ణ పరారీలో పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ లు దర్యాప్తు చేస్తున్నారు.


లాల్‌దర్వాజ ఏరియాలో కూడా నకిలీ స్వీట్ల తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంటిని స్వీట్ల తయారీ కేంద్రంగా మార్చుకొని దందాకు పాల్పడుతున్నారు. రాజస్థాన్‌ నుంచి మిల్క్ పౌడర్ తీసుకొచ్చి వాటితో స్వీట్లు తయారు చేస్తున్నారు. అందులో కెమికల్స్‌ మికిస్‌ చేసి నాసిరకం స్వీట్లు తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బోళా శంకర్‌ను అరెస్టు చేశారు.