Babysitter sentenced to 100 years in prison: ఆమె ఒకడ్ని ప్రేమించింది. ఆమెకు ఇష్టమైతే అతని లైంగిక కోరికలు తీర్చుకోవచ్చు. కానీ ఆమె పసికందుల్ని   తన ప్రియుడి  లైంగిక అవసరాలను తీర్చేందుకు బలి చేసింది.  ఈ ఘోరాలు బయటకు తెలియడంతో వంద ఏళ్ల శిక్షను కోర్టు విదించింది. 

శాన్ డియాగో, కాలిఫోర్నియాలోని ఎస్కొండిడోకు చెందిన బ్రిట్నీ మే లియాన్ (31) అనే మహిళ బేబీసిటర్‌ గా పనిచేస్తోంది. తాను బేబిసిట్టింగ్ చేసే పిల్లలను తన ప్రియుడు సామ్యూల్ కాబ్రెరాతో  లైంగిక వేధింపులకు పాల్పడేలా చేసింది.    ఈ దారుణమైన నేరాలు 2014 నుంచి 2016 వరకు జరిగాయి.  బాధితులలో ఇద్దరు ఆటిజం రోగులు, అందులో ఒకరు ఆ సమయంలో మాటలు రాని స్థితిలో ఉన్నారు.

బ్రిట్నీ లియాన్,   సామ్యూల్ కాబ్రెరా 2016 జులైలో శాన్ డియాగో కౌంటీలోని కార్ల్స్‌బాద్‌లో అరెస్టయ్యారు. ఒక బాధితురాలు తన తల్లికి లైంగిక వేధింపుల గురించి చెప్పడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లియాన్ తన ప్రియుడు కాబ్రెరాతో కలిసి కనీసం నలుగురు చిన్నారులను లైంగికంగా వేధించింది. ఈ దాడులు బాధితుల ఇళ్లలో, లియాన్ , కాబ్రెరా నివాసంలో జరిగాయి.లియాన్, కాబ్రెరాతో డేటింగ్‌కు బదులుగా చిన్నారులను అందించినట్లు టెక్స్ట్ సందేశాల ద్వారా తెలిసింది, ఇది ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ నేరాలు చేసిందని బయట పెట్టింది. 

కాబ్రెరా కారులో రెండు లాక్‌లతో ఉన్న ఒక బాక్స్‌లో ఆరు హార్డ్ డ్రైవ్‌లలో వందలాది వీడియోలను గుర్తించారు.  ఈ వీడియోలలో లియాన్ ,  కాబ్రెరా చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న దృశ్యాలు ఉన్నాయి, కొందరు చిన్నారులు మత్తుమందులతో మత్తులో ఉన్నార,కొందరినికట్టేశారు.  లియాన్ దుకాణాలలోని చేంజింగ్ రూములు, బాత్రూములు, లాకర్ రూములలో మహిళలు , బాలికలను రహస్యంగా వీడియో తీసిన దృశ్యాలు కూడా ఉన్నాయి.  

2025 మేలో కిడ్నాపింగ్, రెసిడెన్షియల్ బర్గ్లరీ,   బహుళ బాధితులపై లైంగిక దాడి ఆరోపణలను కూడా అంగీకరించింది. ఆగస్టు 14, 2025న, ఆమెకు 100 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు విధించారు. సామ్యూల్ కాబ్రెరా* దోషిగా నిర్ధారించబడ్డాడు, ఇందులో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన  కేసులు  ఉన్నాయి. అతనికి ఎనిమిది లైఫ్-వితౌట్-పెరోల్ శిక్షలు, అదనంగా 300 సంవత్సరాలకు పైగా జీవిత ఖైదు విధించారు.  కోర్టులో, లియాన్ రాసిన క్షమాపణ లేఖను ఆమె డిఫెన్స్ అటార్నీ చదివారు. తాను చేసిన తప్పును సరిదిద్దలేనని పశ్చాత్తాపం  వ్యక్తం చేశారు.  కోర్టు ఈ లవర్స్  ఇద్దరికీ పెరోల్ కూడా ఇవ్వొద్దని  ఆదేశించింది. అంటే ఇకబతికినంత కాలం వారు జైల్లోనే బతకాల్సి ఉంటుంది.