APSRTC Bus Fire Accident: ప్రయాణికులతో బయలుదేరింది ఓ పల్లె వెలుగు బస్సు. కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు ఆర్టీసీ బస్. డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సేఫ్ గా దిగిపోయారు. కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది.


అసలేం జరిగిందంటే.. 
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ లో నుంచి మొదలైన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో బస్సు కాలి బూడిదైంది. గుడివాడ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులు విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 60 మంది బస్సులో ఉన్నారు. ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై బస్సును నిలిపి వేశారు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగిన క్రమంలోనే బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలివేయడంతో అవన్నీ కూడా కాలి బూడిద అయ్యాయి. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పవురురు ప్రయాణికులు చెప్పారు. 


అయితే బస్సు దిగిన వెంటనే చాలా దూరంగా పరుగులు పెట్టారు. అంతా దూరంగా నిల్చొని బస్సు కాలిపోవడాన్ని కళ్లారా చూశారు. అప్పటికే పలువురు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది. అలాగే పోలీసులు కూటా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


పది రోజుల క్రింద మహారాష్ట్ర బస్సులో ప్రమాదం - 14 మంది సజీవ దహనం


మహారాష్ట్రలోని నాసిక్​లో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ఘటలో 14 మంది సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.


అసలేం జరిగిందంటే?


శుక్రవారం రాత్రి యవత్మాల్ నుంచి నాసిక్ వైపు 30 మందికి పైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయలు దేరింది. శనివారం వేకువ జామున 4.20 గటంల సమంలో నాసిక్-ఔరంగాబాద్ రబదారిపై ఈ ప్రమాదం జరిగింది. హోటల్ చిల్లీ చౌక్ వద్ద అదుపుతప్పి ట్రక్కుకను బస్సు ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయింది. అయితే బస్సు వెంటనే మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్ర పోతున్నారు.  విషయం గుర్తించిన స్థానిక ప్రజలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈటవపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


"ఈ సంఘటన మా ఇంటి దగ్గర జరిగింది. ఇక్కడ భారీ వాహనాలు తిరుగుతుంటాయి. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు చెలరేగి ప్రజలు సజీవ దహనం అయ్యారు. మేము చూస్తూనే ఉండిపోయాం కానీ ఏం చేయలేకపోయాం. అగ్నిమాపక శాఖ, పోలీసులు తర్వాత వచ్చారు," -  ప్రత్యక్ష సాక్షి