Anantapur : అనంతపురంలో రేష్మ, శారద అనే అమ్మాయిలు వాస్మైల్ అనే హెయిర్ ఆయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దర్నీ ఓ యువకుడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అందులో ఒకరు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయిలెవరు.. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.. వారికి ఈ యువకుడికి ఏంటి సంబంధం అనేది తెలుసుకుంటే.. పాత లవ్ స్టోరీలు చాలా వరకూ మన కళ్ల ముందు మెదులుతాయి. ముఖ్యంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు. 


శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గరిశనపల్లికి చెందిన దివాకర్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. స్కూల్లో  ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన రేష్మ అనే యువతితో స్నేహం ఉంది. నువ్వే కావాలి సినిమా తరహాలో ఇద్దరూ మొదట ఫ్రెండ్ షిప్..అనుకున్నారు. తర్వాత ప్రేమ అని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇద్దరూ ఇంట్లో పెద్ద వాళ్లకు చెప్పే ధైర్యం చేయలేదు. దాంతో రేష్మకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత దివాకర్ లోని ప్రేమికుడు బయటకు వచ్చాడు. నన్ను కాదని వేరే వాడితో జీవితం పంచుకుంటావా రేష్మా అని డైలాగులు చెప్పడంతో ఆమె వారానికే కొత్త భర్తకు విడాకులిచ్చేసింది. దివాకర్ తో లవ్ స్టోరీని కంటిన్యూ చేస్తోంది. ఓ మంచి రోజు చూసి పెద్దలకు చెప్పి పెళ్లిచేసుకుందామని దివాకర్ టైంపాస్ చేస్తున్నాడు.


అయితే ఓ రోజు రేష్మ దివాకర్ ఫోన్ లోని ఇన్ స్టాను చూసింది. అందులో మెసెజ్‌లు చూడటంతో బోయ శారద అనే మహిళతో లవ్ స్టోరీని నడుపుతున్నట్లుగా గుర్తించింది.  కణేకల్లు మండలం యర్రగుంటకు చెందిన శారద నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతోంది. ఆదిమూరి నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది కుప్యూటర్ కోర్స్ చేసేది.  అక్కడే దివాకర్ సోదరి ద్వారా శారద దివాకర్ కు పరిచయమైంది ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. రేష్మతో పాటు మరొకర్ని ఎందుకు ప్రేమించకూడదని ఆమెను కూడా లవ్ చేయడం ప్రారంభించాడు. 


నిందితుడు దివాకర్ నడిపిస్తున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కువకాలం నిలవలేదు.   దివాకర్ ఇంస్టాగ్రామ్ ను చూసి నిజం తెలుసుకుంది. తర్వాత బోయ శారద వద్దకు వెళ్లి జరిగింది అంతా చెప్పింది.  ఇద్దరు మోసపోయామని తెలుసుకున్నారు. అతనితో గొడవకు దిగుతూ వచ్చారు. దివాకర్ తోనే ఇద్దరు తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో అనంతపురానికి దివాకర్ రేష్మను తీసుకువచ్చాడు. హాస్టల్లో ఉంటున్న బోయ శారదా వద్దకు రేష్మను దించి వెళ్లిపోయాడు.  ఇద్దరూ మాట్లాడుకున్న అనంతరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నగరంలోని ఆర్డిఓ కార్యాలయం వద్దకు వెళ్లి సూపర్ వాస్మైల్ చెరువు రెండు బాటిళ్లు తాగారు ఇదే సమయంలో దివాకర్ కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు యువతులు చెప్పారు.  లైవ్ లొకేషన్ ను ప్రియుడుదివాకర్ కు పంపారు. 


వెంటనే ప్రియుడు దివాకర్ వీరిని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ బోయ శారద మృతిచెందగా రేష్మ చికిత్స తీసుకుంటుంది విషయం తెలుసుకున్న పోలీసులు దివాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో కానీ.. ఇక్కడ మాత్రం లవ్ స్టోరీకి ట్రాజెడి ఎండింగ్ పడింది.