Ambernath Suicide Case:పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ నవ వధువుకు అది నూరేళ్ల మంటగా మారింది. కట్టుకున్నవాడే కాలయముడైతే , కాపాడాల్సిన డాక్టరే ప్రాణాలు తీసేలా వేధిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో అంబర్‌నాథ్‌లో జరిగిన ఘటన కళ్లకు కడుతోంది. కేవలం 48 రోజులు అంటే రెండు నెలలు కూడా గడవక ముందే 26 ఏళ్ల విశాఖ తిలక్ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంచలనంగా మారింది. 

Continues below advertisement

సాధారణంగా దొంగల భయం కోసం కెమెరాలు పెడతారు. కానీ ఇక్కడ ఒక డాక్టర్‌ తన భార్య ప్రతి కదలికను, ఆమె ఎవరితో మాట్లాడుతుందో, ఏం చేస్తుందో వాచ్ చేయడానికి ఏకంగా ఇళ్లంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాడు. చివరకు బెడ్‌రూమ్‌లో కూడా పెట్టాడు. ఇంటిని ఒక డిజిటల్ జైలుగా మార్చేశాడు. ఈ మానసిక హింసను భరించలేకే ఆ యువతి తనువు చాలించిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పడక నుంచి గడప వరకు కెమెరాలే 

ముంబైకి సమీపంలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌లో నివసించే డాక్టర్ నితిన్ తిలకర్‌తో విశాఖకు ఏప్రిల్‌ 30న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లికి ముందు అంతా సవ్యంగానే ఉన్నా, మెట్టిన ఇంట్లో అడుగు పెట్టిన కొద్ది రోజులకే అసలు రంగు బయటపడింది. భార్య ఎవరితోనూ మాట్లాడకూడదు, బయటకు వెళ్లకూడదు అనే ఉన్మాదంతో నితిన ఇంటి లోపల, బట అనేక సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. ఆమె ఇంట్లో ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తన ఫోన్ ద్వారా నిరంతరం నిఘా ఉంచేవాడు. ఇది ఆమె ప్రైవేసిని పూర్తిగా హరించడమే కాకుండా, ఆమెను ఒక ఖైదీలా మార్చేసింది. 

Continues below advertisement

పొరుగింటి వారితో మాట్లాడితే దాడులు 

ఈ కేసులో అత్యంత కిరాతకమైన విషయం ఏంటంటే, విశాఖ పొరుగింటి మహిళలతో మాట్లాడిందని తెలిసి నితిన్ ఆమెను దారుణంగా కొట్టాడు. చదువుకున్న డాక్ట్ అయి ఉండి, భార్య కనీసం ఇరుగుపొరుగుతో మాట్లాడటానికి కూడా సంహిచలేకపోయాడు. ఆత్మహత్యకు రెండు రోజుల ముందు కూడా ఇదే విషయంపై ఆమెపై చేయిచేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మర్యాదల పేరుతో వేధింపులు

కేవలం నిఘా మాత్రమే కాదు, ఈ కేసులో వరకట్న వేధింపులు కూడా ఉన్నాయని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. పెళ్లి సమయంలో తమకు ఆశించిన స్థాయిలో బహుమతులు రాలేదని, తమకు దక్కాల్సిన మర్యాద దక్కలేదని నితిన్ తల్లి ఛాయా, సోదరుడు నినాద్‌ కలిసి విశాఖను నిరంతరం వేధించేవారు. పుట్టింటి నుంచి నగలు, డబ్బు తీసుకురావాలని ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారు. 

కాపాడాలనుకునే లోపే కడతేరిన ప్రాణం

తనపై జరుగుతున్న ఈ దారుణాల గురించి విశాఖ తన తల్లికి ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుంది. కూతురి పరిస్థితి చూసి కలత చెందిన తల్లిదండ్రులు, అమెను ఇంటికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వారు ఆమెను రక్షించేలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. విశాఖ తన నివాసంలో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. 

డాక్టర్ అరెస్టు 

ఈ ఘటనపై అంబర్‌నాథ్‌లోని శివాజీనగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమాదైంది. నితిన్ తిలక్, అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్‌లపై సెక్షన్ల కింద వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం డాక్టర్ నితిన్‌ను పోలీసులు అరెస్టు చేయగా, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.