Air Hostess Sexually Assaulted While On Ventilator: ఆమె ఓ ఎయిర్ హోస్టెస్. అనారోగ్యానికి గురైంది. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందింది. కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయింది. కానీ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న  ఆస్పత్రి సిబ్బందిలోని కొంత మంది లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా భర్తకు చెప్పింది. అప్పట్లో చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో ఎవరికీ చెప్పలేకపోయింది. కోలుకున్న తర్వాత భర్తకు చెప్పడంతో  అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఏప్రిల్ 6న గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఎయిర్ హోస్టెస్  ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. 

Continues below advertisement


డిశ్చార్జ్ అయిన తర్వాత తనపై జరిగిన ఘోరం గురించి  భర్తకు చెప్పిన ఎయిర్ హోస్టెస్ 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 13న తాను డిశ్చార్జ్ అయిన తర్వాత లైంగిక వేధింపుల గురించి తన భర్తకు చెప్పగా, అతను పోలీసులకు సమాచారం అందించాడు.46 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా  సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  పోలీసులు  దర్యాప్తు  ప్రారంభించారు.  


శిక్షణ కోసం వచ్చి అనారోగ్యానికి గురైన ఎయిర్ హోస్టెస్ 


బాధిత ఎయిర్ హోస్టెస్  కంపెనీ తరపున శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వచ్చి ఒక హోటల్‌లో బస చేసింది. ఈ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దాంతో హోటల్ సిబ్బంది ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కొద్ది రోజుల చికిత్స తర్వతా  ఆమె భర్త ఆమెను  గురుగ్రామ్‌లోని మరొక ఆసుపత్రిలో చేర్చారు. ఏప్రిల్ 13న ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.


నర్సుల సమక్షంలోనే లైంగిక దాడి 


"చికిత్స సమయంలో, ఏప్రిల్ 6న  వెంటిలేటర్‌పై ఉన్నాను, ఆ సమయంలో ఆసుపత్రిలోని కొంతమంది సిబ్బంది ఆమెపై లైంగిక దాడి చేశారు. ఆ సమయంలో మాట్లాడలేకపోయాను.  చాలా భయపడ్డాను. సంఘటన సమయంలో ఏం జరుగుతుందో  గుర్తించలేని స్థితిలో ఉన్నాను.   ఇద్దరు నర్సులు   ఉన్నారు" అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు 


మొదట ఆమె తన భర్తకు తెలిపింది. అతను పోలీసులకు సమాచారం ఇచ్చి   లీగల్ అడ్వైజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు  గురుగ్రామ్‌లోని సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.  నిందితుడిని గుర్తించడానికి ఆస్పత్రి డ్యూటీ చార్ట్‌, సిసిటివి ఫుటేజ్‌ను విశ్లేషించడానికి ఒక పోలీసు బృందాన్ని ఆస్పత్రికి పంపించారు.  ఈ విషయంపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించలేదు.           


పోలీసులు ఓ అనుమానితుడ్ని గుర్తించారు. అదే సమయంలో నర్సుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. రోగుల పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన వ్యక్తిని అసలు క్షమించకూడదన్న డిమాండ్లు సోషల్ మీాడియాలో వినిపిస్తున్నాయి.