Brother And Sister Died: అర్ధ రాత్రి  అంతా పడుకున్నారు. ఆ సమయంలోనే ఇంట్లో దూరిన పాము ఒకే కుటుంబంలోని అన్నా చెల్లెల్ల ఇద్దరినీ మృతి చెందారు. విషయం గుర్తించి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించేలోపే అన్నా, చెల్లెల్లిద్దరూ మృతి చెందారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.


ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడలో విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్థరాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో కరెంటు కూడా పోవడంతో.. గుడిసెంతా చీకటిగా మారింది.  ఎంత సేపయినా కరెంటు వచ్చేలా లేదనుకొని తన ఏడుగురు పిల్లలను పడుకోబెట్టి తాను కూడా పడుకుంది. అర్ధరాత్రి వర్షం మరింత ఎక్కువైంది. దీంతో బయట నుంచి ఓ విష సర్పం వారి గుడిసెలొకి చొరబడింది. నిద్రిస్తున్న ఆత్రం భీంరావ్(13) ను పక్కనున్న ఆత్రం దీపా (4) ను కాటేసింది. అయితే పిల్లలిద్దరూ ఏదో కుడుతుందని చెప్పగానే తల్లి టార్చి వేసి చూసింది. దీంతో పాము కనిపించగా పిల్లలందరినీ తీసుకొని బయటకు వచ్చి కేకలు వేసింది. దీంతో స్థానికులంతా గుమి గూడారు. పిల్లలను ఆస్పత్రికి తరలించేందుకు గాను అంబులెన్స్ కు ఫోన్ చేశారు. 


ఆస్పత్రికి తరలించే లోపే మృతి..


పాటగూడకు వెళ్లే రోడ్డు సరిగ్గా లేకపోతే.. 108 వాహనం వర్షం నీటిలో దిగబడిపోయింది. ఈ విషయాన్ని అంబులెన్స్ సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి చెప్పగా.. వారంతా వెళ్లి దాన్ని తోశారు. చాలా సేపటికి అంబులెన్స్ గ్రామానికి చేరింది. పాము కాటుకు గురైన పిల్లలిద్దరినీ ఆదిలాబాద్ రిమ్స్ స్పత్రికి తరలించారు. అయితే పాముకాటుకు గురైన 
క్రమంలో దగ్గరలోనే రాజుగూడ వద్ద ఆ ఇద్దరు మృతిచెందారు. దీంతో 108 సిబ్బంది వారిని తిరిగి ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళి వదిలారు. పాముకాటుతో మృతిచెందిన ఆత్రం భీంరావ్ (13), ఆత్రం ధీపా (4) అనే అన్న చెల్లి ఇద్దరు ఓకే కుటుంబానికి చెందినవారు. ఈ విషయమై ఇంద్రవెల్లి ఎస్సై బి. సునిల్ పోలీస్ సిబ్బందితో కలిసి వివరాలు సేకరించి ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంకాకానీ అన్నా చెల్లెల్లిద్దరూ మార్గమధ్యంలోనే మృతి చెందారు. అయితే పంచనామా నిర్వహించిన పోలీసులు పోస్టుమార్టం కోసం అదే రిమ్స్ ఆస్పత్రికి పంపించారు. 


అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం..


గుడిసెలో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు విష సర్పం కాటుకు గురై మరణించడం బాధకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బొజ్జు అన్నారు. ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విష సర్పం కాటుతో మృతి చెందిన ఇద్దరు చిన్నారులను కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం తన వంతుగా కొంత సహాయాన్ని అందించారు. పాటగూడలో గుడిసెల్లో నివసిస్తున్న కొలాం తెగకు చెందిన ఆదివాసీలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గుడిసెలో నిద్రిస్తున్న చిన్నారులను పాము కాటు వేయడంతో ఇద్దరు మృతి చెందారని,  వారి కుటుంబాన్ని చూసైనా ప్రభుత్వంలో చలనం రావాలని నిరుపేదలకు సహకారం అందించాలి అన్నారు. 


ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి..


ముఖ్యంగా గ్రామానికి వెళ్లే రోడ్డు అటవీ అధికారుల అడ్డంకి వల్ల బాగు చెయలేకపోతున్నారని, రోడ్డు బాగులేక 108 అరగంట ఆలస్యంగా రావడం వల్లే పిల్లల మృతికి కారణం అని తెలిపారు. ముందుగా రోడ్డును బాగుచేసి గ్రామస్థులకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే, ఎంపీలు తగిన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు.