ATM theft case in chandragiri | ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడు అనేది పాత సామెత. ప్రస్తుతం సీసీ కెమెరాలు, పోలీసులు ఇంటి దొంగను పట్టి జైలుకు పంపుతారని గుర్తించలేని ఓ టీమ్ ఇట్టే నేరం చేసి అలా బుక్ అయిన ఘటన చోటుచేసుకుంది. ఏటీఎంలో పని చేసే వ్యక్తి అక్కడ ఉన్న డబ్బు కొట్టేసేందుకు ఓ పథకం ప్రయోగించి విఫలమైన ఘటన చంద్రగిరి లో వెలుగు చూసింది. ఆగస్టు నెల 27వ తేదీన  చంద్రగిరి లో ఎసిబి ఏటీఎం చోరీ జరిగింది. ఈ ఘటన పై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఇంటి దొంగల పనిగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.


39 లక్షలు పెట్టకుండా..? 


ఏటీఎం లో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ప్రతిరోజు లక్లల రూపాయలు డబ్బు చూస్తూ దానిని కాజేయాలని పథకం పన్నాడు.  ఏటీఎంలో పెట్టే నగద సుమారు రూ. 39 లక్షలు మిషన్ లో పెట్టకుండా పెట్టినట్లు సిస్టం అప్డేట్ చేసారు. ఏటీఎం మిషన్ సార్ చేయకుండా షటర్ కు తాళం వేసి వెళ్లిపోయారు. వారి కాజేసిన నగదు విషయం బయటకు రాకుండా కార్స్ ఫులు ధరించి అదే రోజు రాత్రి ఏటీఎం కు వచ్చారు. ఏటీఎం నుంచి నగదు ఎత్తుకెళ్లినట్లు చాల చాకచక్యంగా వ్యవహరించారు. పోలీస్ అధికారుల సమాచారం మేరకు సురేష్ అనే వ్యక్తిని అదుపులో కి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని విచారణ చేసి ప్రాథమిక అంచనాకు వచ్చారని తెలుస్తోంది. అయితే ఇదేదరు.. ముగ్గురు కాదు ఇందులో చాలా మంది ప్రమేయం ఉండే అవకాశం కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.


 ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ప్రమాదం, ఒకరు మృతి, మరొకరికి గాయాలు


తమ అభిమాన నాయకుడి ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందాగా.. మరొక్కరు గాయపడిన ఘటన చంద్రగిరి నియోజకవర్గం లో చోటు చేసుకుంది.  చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీలో జనసేనా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  జన్మదిన వేడుకలు నిర్వహించడానికి సోమవారం ప్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా 11కేవి విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోపి అనే వ్యక్తి ప్రమాద స్థలంలో మృతి చెందాడు.. మధు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


ఈ ఘటనలో చనిపోయిన గోపి మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. గాయపడిన మధు చికిత్స పొందుతున్నారు. వీరిని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్,  రాజారెడ్డి పరామర్శించి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బాధితుడితో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని, ఇద్దరి కి సంబంధించిన పరిహారం తో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాలకు ధైర్యం కల్పించారు. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 2 లక్లలు, గాయపడిన వ్యక్తికి 50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదం పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.