Wife Pours Hot Water on Her Husband: పల్నాడు (Palnadu) జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ నిద్రిస్తోన్న తన భర్త మర్మాంగంపై సల సల మరిగే నీటిని పోసింది. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం (Yerragondapalem) గ్రామానికి చెందిన నాయిని ప్రభుదాసు, అనూషలు గత కొన్ని రోజుల నుంచి హనుమాన్ నగర్ 13వ లైన్ లో నివాసం ఉంటున్నారు. అయితే, కుటుంబ కలహాలతో భార్యాభర్తలు కొద్ది రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసిన అనూష తల్లిదండ్రులు కూతురిని ఇటీవలే మళ్లీ కాపురానికి పంపారు. ప్రభుదాసు నెలవారీ పద్ధతిలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద మనుషుల పంచాయతీ అనంతరం వారం క్రితమే భార్యను వినుకొండకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై అనూష మరిగే వేడి నీటిని పోసింది. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, తన భార్య తల్లిదండ్రులు సుబ్బారావు, అక్కమ్మ వారి కుటుంబ సభ్యులు ఓ పథకం ప్రకారం తన భార్యతో ఇలా తనను చంపించేందుకు ప్రయత్నించారని ప్రభుదాసు ఆరోపించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనూషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Also Read: Ap Congress: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు? - పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ అక్కడి నుంచే!