Bride Suicide In Prakasam District | కంభం: ఈరోజుల్లో ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుంతో ఊహించలేక పోతున్నాం. అప్పటివరకూ సంతోషంగా గడిపిన వారు మరుక్షణమే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. కూతురు వివాహం ఘనంగా జరిపించాం. అంతా బానే ఉందనుకున్న సమయంలో కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరం గ్రామంలో ఈ విషాదం జరిగింది.


అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరానికి చెందిన సుస్మితకు, పెద్దారవీడు మండలం సిద్ది నాయుడు పల్లికి చెందిన వెంకటేష్‌కు కొన్ని రోజుల కిందట పెద్దలు వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 16వ తేదీన ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 17న వధువు సుస్మిత స్వగ్రామం దేవనగరంలో కొత్త జంటలకు ఫస్ట్ నైట్ కార్యం కూడా జరిపించారు. మరుసటి రోజు ఫిబ్రవరి 18న నవ వధువు తన పుట్టింటి నుంచి అత్తారింటికి బయలుదేరాల్సి ఉంది. కుటుంబసభ్యులు, బంధువులు సుస్మితతో మాట్లాడి అత్తారింటికి అప్పగింతలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలో ఏం జరిగిందో కానీ వధువు సుస్మిత మంగళవారం మధ్యాహ్నం పుట్టింట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 


ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య


సుస్మితను భోజనానికి పిలిచేందుకు సోదరుడు మహేష్‌ వెళ్లి చూడగా నవ వధువు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండటం గమనించాడు. చెల్లెలు సుస్మితను కిందకి దింపి కుటుంబసభ్యులతో కలిసి కంభం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సుస్మిత చనిపోయిందని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఊహించని సంఘటనతో ఇరు కుటుంబాలు ఆశ్చర్యానికి లోనయ్యాయి. కూతురికి ఘనంగా వివాహం చేశాం, తమ బాధ్యత నెరవేర్చామని సంతోషంగా ఉన్న తల్లిదండ్రులకు సుస్మిత ఆత్మహత్య విషాదాన్ని నింపింది. అప్పటివరకూ బాగున్న సుస్మిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని అనుమానాలు మొదలయ్యాయి.


పెళ్లిపై పోలీసుల అనుమానాలు


ఆమెకు ఇష్టపూర్వకంగా పెళ్లి జరగలేదా, ఇష్టం లేకుండా వివాహం జరిపించారా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.  సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాళ్ల పారాణి ఆరకముందే సుస్మిత మృతి చెందడంతో దేవనగరంలో విషాదం నెలకొంది. ఇష్టంలేని పెళ్లి చేయడం, లేక ప్రేమ వ్యవహారం కారణంగానో నవ వధువు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందడంతో దేవనగరం గ్రామంలో విషాదం నెలకొంది.


Also Read: Crime News: ప్రియుడితో ఏకాంతంగా భార్యను చూసిన భర్త! ఆవేశంతో చెయ్యి నరికి ఆపై దారుణం