Encounter in Alluri District | అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఏలూరు రేంజ్ పరిధిలోని కొయ్యలగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. జోనల్‌ కమిటీ సభ్యులు గాజర్ల రవి, అరుణ, మరో మావోయిస్టు ఉన్నారని సమాచారం. అరుణ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఆమె స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్. మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వర రావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో మావోయిస్టు అరుణ పాల్గొందని ఆరోపణలున్నాయి.

కాల్పులు జరిగిన ప్రదేశంలో ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ తెల్లవారుజామున  కాల్పులు జరిగాయి. గత నెల రోజుల నుంచి భద్రతా బలగాలు ఛత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటివరకూ జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారు.

చనిపోయిన మావోయిస్టుల వివరాలు..

1) గాజర్ల ravi.... అలియాస్ ఉదయ్...గణేష్ అలియాస్ బిరుసు....తెలంగాణ భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామం చిట్యాల మండలం25 లక్షలు రివార్డ్.....సెంట్రల్ కమిటీ, AOB స్పెషల్ జోనల్ mbar

2) వెంకట రవి లక్ష్మి చైతన్య (54), అలియాస్ అరుణ.... అలియాస్ రూపీ..కరక వాణి పాలెం పెందుర్తి మండలం విశాఖ జిల్లా......20 లక్షల రివార్డ్..స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, Aob...మెంబర్..ఈమె తమ్ముడు అజాత్ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి చెందాడు. ఈమె తల్లి మావి నేత, గతంలో మృతిచెందింది. మావో సీసీ మెంబర్ చలపతి ఈమె భర్త.... చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తి. తరవాత శ్రీకాకుళం దగ్గరలో కాల్పుల్లో మృతిచెందాడు. విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వర రావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో అరుణ పాల్గొంది.

లొంగిపోయిన నక్సలైట్ల కుటుంబసభ్యుల హత్య

వరంగల్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం కొందరు నక్సలైట్లు లొంగిపోయారు. నక్సలైట్ కుటుంబంలోని ముగ్గురిని చంపినట్లు సమాచారం. మరో కొంతమంది గ్రామస్తులను చితకబాది, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 

ఈ సంఘటన నక్సల్స్ ప్రభావిత పెద్దకోర్మా గ్రామంలో జరిగింది. మంగళవారం (జూన్ 17న) సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య నక్సలైట్లు పెద్ద సంఖ్యలో వచ్చి అరాచకాలకు పాల్పడ్డారు. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సలైట్ దినేష్ మోడియం బంధువులు జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మాద్వి లను మావోయిస్టులు హతమార్చారని సమాచారం. 

ఈ గ్రామంలోని దాదాపు 7 మంది గ్రామస్తులను పిలిచి నిర్దాక్షిణ్యంగా కొట్టినట్లుగా వారి కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామానికి పోలీసు బృందాన్ని పంపి సమాచారం సేకరిస్తున్నట్లు ASP చంద్రకాంత్ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబసభ్యులను హతమార్చిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.