Maharashtra Bus Accident: మహారాష్ట్రలోని నాసిక్​లో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ఘటలో 14 మంది సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.






అసలేం జరిగిందంటే?


శుక్రవారం రాత్రి యవత్మాల్ నుంచి నాసిక్ వైపు 30 మందికి పైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయలు దేరింది. శనివారం వేకువ జామున 4.20 గటంల సమంలో నాసిక్-ఔరంగాబాద్ రబదారిపై ఈ ప్రమాదం జరిగింది. హోటల్ చిల్లీ చౌక్ వద్ద అదుపుతప్పి ట్రక్కుకను బస్సు ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయింది. అయితే బస్సు వెంటనే మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్ర పోతున్నారు.  విషయం గుర్తించిన స్థానిక ప్రజలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈటవపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 






"ఈ సంఘటన మా ఇంటి దగ్గర జరిగింది. ఇక్కడ భారీ వాహనాలు తిరుగుతుంటాయి. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు చెలరేగి ప్రజలు సజీవ దహనం అయ్యారు. మేము చూస్తూనే ఉండిపోయాం కానీ ఏం చేయలేకపోయాం. అగ్నిమాపక శాఖ, పోలీసులు తర్వాత వచ్చారు," -  ప్రత్యక్ష సాక్షి


నిన్నటికి నిన్న కేరళలో తొమ్మిది మంది మృతి..


నిన్నటికి నిన్న కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ విద్యార్థుల బస్సు.. ఆర్టీసీని ఢీ కొట్టిన ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.


ట్రిప్ కోసం


పాలక్కాడ్ జిల్లాలోని వడక్కంచెరిలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సును టూరిస్ట్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 38 మంది గాయపడ్డారు. టూరిస్ట్ బస్సులో ఎర్నాకులం జిల్లాలోని బసేలియోస్ విద్యానికేతన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. టూరిస్ట్ బస్సు ఊటీకి వెళ్తోంది.


ఇలా జరిగింది


టూరిస్టు బస్సు వెనుక నుంచి కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బసేలియోస్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన టూరిస్ట్ బస్సు ఎర్నాకులం నుంచి ఊటీకి విహారయాత్ర కోసం వెళుతుంది. KSRTC బస్సు కోయంబత్తూరుకు వెళుతుంది. మృతుల్లో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, కేఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 38 మంది ప్రయాణికులను ఆసుపత్రిలో చేర్చారు. 



"ఎర్నాకులం నుంచి ఊటీ వెళ్తోన్న ఓ టూరిస్ట్ బస్సు.. పాలక్కాడ్ వడక్కంచెరిలో హైవేపైన ఉన్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. 40 మందికి సాధారణ గాయలయ్యాయి. వీరంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు." -ఎమ్‌బీ రాజేశ్, కేరళ రవాణా మంత్రి