Benefits of Zero Interest EMI: నేడు చాలా మంది డెబిట్ కార్డులతో క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఈ రోజుల్లో షాపింగ్‌పై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ EMI సౌకర్యం వంటి పలు ప్రయోజనాలు మీకు అందిస్తుంది. ముఖ్యంగా జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ (Zero-Interest EMI) ఫీచర్ మన వద్ద డబ్బులు లేకున్నా వస్తువులను సులభంగా కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నాం. దీని ద్వారా మీరు ఖరీదైన వస్తువులు కొన్నప్పటికీ ఒకేసారి కాకుండా చిన్న చిన్న వాయిదాలలో చెల్లించవచ్చు.
జీరో ఇంట్రెస్ట్ EMI అంటే ఏమిటి?కొన్ని కంపెనీలు వినియోగదారులకు జీరో ఇంట్రెస్ట్ EMI అవకాశం కల్పిస్తున్నాయి. మీరు ఏదైనా వస్తువయ్యే ఖర్చు, బిల్లులను ఒకేసారి చెల్లించడానికి బదులుగా ఈఎంఐల రూపంలో వాయిదాలలో చెల్లిస్తారు. కానీ దానిపై మీరు విడిగా ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియనే జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ అంటారు. కొన్ని పాయింట్లు తెలుసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది.
సాధారణంగా చూస్తే, EMI కాలపరిమితి 3 నెలల నుండి 24 నెలల వరకు ఉంటుంది.
రూ. 5 వేల కంటే ఎక్కువ కొనుగోలుపై EMI లభిస్తుంది.
అలాగే పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించే సౌకర్యం ఉంటుంది.
నో కాస్ట్ EMI (No Cost EMI) ఎలా పనిచేస్తుంది?
సాధారణ EMIలో మీరు కచ్చితంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ జీరో ఇంట్రెస్ట్ EMIలో అలా ఉండదు.
బ్యాంక్ మీకు EMIలో చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది
అలాగే సెల్లర్) ముందుగానే డిస్కౌంట్ ఇచ్చి వడ్డీని సర్దుబాటు చేస్తారు.
దీనివల్ల EMIపై అదనపు ఛార్జీలు లేవని కస్టమర్ భావిస్తారు.
నిజంగానే వడ్డీ లేని EMI ఉంటుందా?వాస్తవం ఏంటంటే జీరో ఇంట్రెస్ట్ EMI అంతా భావించినట్లుగా పూర్తిగా ఉచితం కాదు.
కొన్నిసార్లు వస్తువు ధరను సెల్లర్స్ ముందుగానే పెంచుతారు.
ఇందులో వడ్డీ ఖర్చులను సైతం ఆ ధరలోనే కలిపేస్తారు.
కొన్ని సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజు కూడా పడుతుందని గుర్తుంచుకోవాలి.
అలాగే ఈఎంఐలపై సైతం GST చెల్లించాల్సి రావచ్చు.
దీనిని ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ. 1 లక్ష అవుతుంది అనుకుందాం. దానిపై 6 నెలల వడ్డీ 6 వేల రూపాయలు అవుతుంది. బ్యాంక్ వడ్డీ వసూలు చేస్తుంది. కానీ ఆ సెల్లర్ ముందుగానే రూ. 6 వేల డిస్కౌంట్ ఇస్తాడు. ఇలా చేయడంతో కస్టమర్‌కు ఆ EMI వడ్డీ లేనట్లు అనిపిస్తుంది.
ఆ బ్యాకెండ్ ఖర్చుల నుండి ఎలా తప్పించుకోవాలి?
మొదట మీరు వేర్వేరు వెబ్‌సైట్లు, షాపుల్లో ధరలను పోల్చి చూడాలి.
అలాగే ఎక్కువ తగ్గింపును చూసి వెంటనే నమ్మవద్దు.
వస్తువు అసలు ధర ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
EMI తీసుకునే ముందు వీటిని తప్పక తెలుసుకోండి
ఫస్ట్ విషయం EMI టైమ్ పీరియడ్.
తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఉందో లేదో చెక్ చేయాలి.
లోన్ ముందుగానే చెల్లిస్తే (Foreclosure) ఏవైనా ఛార్జీలు ఉన్నాయా.
అలాగే అన్ని రూల్స్, కండీషన్స్ (Terms & Conditions) ఏమిటో చూడండి.
క్రెడిట్ కార్డ్‌ను ఎలా ఎంచుకోవాలి?ఈ రోజుల్లో అనేక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విభిన్న జీరో-ఇంట్రెస్ట్ EMI కలిగిన క్రెడిట్ కార్డ్‌లను చూడవచ్చు.
100 శాతం డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్.
చాలా కార్డులు లైఫ్‌టైమ్ ఫ్రీగా అందిస్తున్నారు.
వేర్వేరు కంపెనీలతో భాగస్వామ్యంలో కూడా మీకు కొత్త ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి