Gold Price :  2025 సంవత్సరంలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. అక్షయ తృతీయకు ముందే బంగారం 1 లక్ష రూపాయలకుపైగా చేరుకుంది. రానున్న సంవత్సరాల్లో కూడా బంగారం ధరలు పెరగడానికి అవకాశం ఉంది. జేపీ మోర్గాన్ బ్యాంక్ అంచనా ప్రకారం 2026 నాటికి బంగారం ఔన్స్‌ 4,000 డాలర్లు కు చేరుకోవచ్చు. అదే సమయంలో, మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, యార్డెనీ రీసెర్చ్ ప్రెసిడెంట్ ఎడ్ యార్డెనీ అభిప్రాయం ప్రకారం ప్రతి ఔన్స్‌ 4,000 డాలర్లు బంగారం 2025 నాటికే చేరుకుంటుంది. 2026లో బంగారం ఔన్స్‌ 5,000 డాలర్లు కూడా దాటవచ్చు. 

ఎందుకు పెరుగుతున్నాయి ? 

ఈ లెక్కన చూస్తే, ఈ ఏడాది బంగారం 1,35,000 రూపాయలు 2026లో 1,53,000 రూపాయలు 10 గ్రాములకు చేరుకోవచ్చు. గ్లోబల్ బ్రోకరేజ్ ఫర్మ్ గోల్డ్‌మన్ సాక్స్ కూడా 2025 చివరి నాటికి బంగారం ఔన్స్‌ 3,700 డాలర్లుకు పెరగవచ్చని అంచనా వేసింది.

అదే సమయంలో, తదుపరి సంవత్సరం చివరి నాటికి ఔన్స్‌ 4,500 డాలర్లుకు చేరుకోవచ్చు. జేపీ మోర్గాన్ చేసిన అంచనాల ప్రధాన కారణం, పెట్టుబడిదారులతోపాటు కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారం కొనుగోలు బలంగా ఉంటుందని చెబుతున్నారు.  

బ్యాంక్ అంచనా ప్రకారం, ఈ ఏడాది ప్రతి త్రైమాసికంలో స్వచ్ఛమైన బంగారం డిమాండ్ సగటున 710 టన్నుల సమీపంలో ఉంటుంది. అయితే, కేంద్ర బ్యాంకుల నుంచి బంగారం డిమాండ్ బలహీనపడితే లేదా టారిఫ్ షాక్‌ల నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుంటే, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని జేపీ మోర్గాన్  చెబుతోంది. 

వెండిపై అంచనా

వెండి విషయంలో జేపీ మోర్గాన్ 2025 రెండో  సగంలో వెండి ధరల్లో మెరుగుదల కనిపిస్తుందని, సంవత్సరం చివరి నాటికి ఔన్స్‌ 39 డాలర్లు కు చేరుకోవచ్చని అంచనా వేసింది. 

ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?

తాజా ధరలు చూస్తే 10 గ్రాములకు రూ. లక్షకు చేరుకున్న తర్వాత బంగారం ధర ఇప్పుడు క్రమంగా తగ్గడం ప్రారంభించింది. అయితే, శుక్రవారం ప్రారంభ బిజినెస్‌లో, వెండి ధర తగ్గగా బంగారం ధర పెరిగింది. శుక్రవారం, 

MCXలో 10 గ్రాములకు రూ. 95,562గా అమ్ముడవుతోంది, అంటే దాని ధర దాదాపు రూ. 1240 పెరిగింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, MCXలో వెండి రూ. 36 తగ్గి కిలోకు రూ. 97,475గా అమ్ముడవుతోంది.ఇండియన్ బులియన్ అసోసియేషన్ (IBA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.96,190 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.88,119గా ఉంది. అదేవిధంగా, వెండి కిలోకు రూ.88,174 వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు చూసుకుంటే పదిగ్రాముల బంగారం ధర 94, 550 రూపాయలుగా ఉంది. బంగారం ధరల్లో హైదరాబాద్‌లో మాత్రం నిన్నటి ఇవాళ్టికి తేడా లేదు. 

ముంబైలోని ఇండియన్ బులియన్ ప్రకారం, 10 గ్రాములకు బంగారం 96,020 ఉండగా, MCXలో బంగారం రూ.95,962 వద్ద అమ్ముడవుతోంది. వెండి రూ.97,770 వద్ద , MCXలో వెండి కిలోకు రూ.97,475 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరు గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఇండియన్ బులియన్ బంగారం రేటు రూ.96,090, MCXలో బంగారం 10 గ్రాములకు రూ.95,962 వద్ద అమ్ముడవుతోంది. బులియన్ వెండి కిలోకు రూ. 97,850  MCXలో వెండి కిలోకు రూ. 97,474.

దేశ రాజధాని ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ బంగారు బులియన్ ధర 10 గ్రాములకు రూ. 95,850, MCXలో బంగారం రూ. 95,962 చొప్పున అమ్ముడవుతోంది. వెండి బులియన్ ధర కిలోకు రూ. 97,600, వెండి MCXలో రూ. 97,475 చొప్పున అమ్ముడవుతోంది.

చెన్నైలో ధరలను పరిశీలిస్తే, బులియన్‌పై బంగారం రేటు 10 గ్రాములకు రూ. 96,300, MCXలో బంగారం రూ. 95,962 చొప్పున అమ్ముడవుతోంది. చెన్నైలో వెండి బులియన్‌పై రూ. 98,060, MCXలో వెండి రూ. 97,475 వద్ద ట్రేడవుతోంది.

కోల్‌కతాలో బులియన్‌పై బంగారం ధర 10 గ్రాములకు రూ.95,890 ఉండగా, MCX బంగారంపై రూ.95,962 ఉంది. మరోవైపు, కోల్‌కతాలో బులియన్‌పై వెండి ధర కిలోకు రూ.97,640 ఉండగా, MCXలో వెండి ధర రూ.97,475 వద్ద అమ్ముడవుతోంది.