అన్వేషించండి

72nd Miss World Winner : మిస్ వరల్డ్‌ ఓపల్ సుచాతాకు వచ్చే నగదు బహుమతిపై గిఫ్ట్‌ ట్యాక్స్‌ ఏ దేశ ఖాతాలోకి వెళ్తుంది? 

72nd Miss World Winner : బహుమతులు గెలుచుకుంటే కొంత గిఫ్ట్‌ ట్యాక్స్ చెల్లించాలి. ఇప్పుడు మిస్‌ వరల్డ్ పోటీల్లో విజేతకు ఇచ్చిన నగదులో పన్ను ఏ దేశానికి చెల్లించాలి?

72nd Miss World Winner Opal Suchata Chuangsri : మిస్‌ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ కి లభించిన నగదు బహుమతి అక్షరాల 8.5 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ నగదుకు కచ్చితంగా ఆమె పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఈవెంట్‌ భారత్‌లో జరిగినందున ఎవరికి చెల్లించాలి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. 

ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచినందుకు ఆమెకు వజ్రాలు పొదిగిన కిరీటంతోపాటు భారీగా నగదు కూడా వచ్చింది. ఆమెకు ఈ పోటీల్లో విజేతగా నిలిచినందుకు 8.5 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. ఈ నగదు బహుమతిగా వచ్చినందుకు ఆమె గిఫ్ట్ ట్యాక్స్‌ను తన సొంత దేశంలో చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ పన్ను నియమాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు ఉంటాయి. భారత్‌లో ఈవెంట్ మాత్రమే జరిగింది. కాబట్టి భారత్‌కు ఆమె ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. 

థాయ్‌లాండ్ పన్ను చట్టాలు:-థాయ్‌లాండ్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను కింద ఇలాంటి బహుమతలు ఆదాయంగా వస్తే మాత్రం ట్యాక్స్ చెల్లించాలి. ఇలాంటి ఆదాయంపై ఐదు శాతం నుంచి 35 శాతం వరకు ట్యాక్స్ చెల్లించాలి. ఆదాయ స్థాయిని బట్టి ఓపల్‌ తన నగదు బహుమతిలో ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 35 శాతం వరకు పన్ను రూపంలో ఓపల్ కట్టేయాల్సి ఉంటుంది. 

మిస్‌ వరల్డ్ పోటీలు జరిగిన దేశం:- ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు తొలిసారిగా హైదరాబాద్‌్లో జరిగాయి. అంటే భారత్‌లో ఈ ఈవెంట్ జరిగింది. అయినా సరే ఆమె స్థానిక నివాసితురాలు కాదు కాబట్టి విజేత ఇక్కడ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. భారత్ దేశంలో విదేశీయులు సంపాదించే ఆదాయంపై పన్ను విధించే రూల్స్ ఉన్నప్పటికీ మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ పోటీల బహుమతులు సాధారణంగా విజేత నివాస దేశంలోనే పన్ను పరిధిలోకి వస్తాయి. 

అంతర్జాతీయ పన్ను ఒప్పందాలు:- థాయ్‌లాండ్, భారత్ మధ్య డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్‌ అగ్రిమెంట్ ఉంది. దీని ప్రకారం ఓపల్ ఈ బహుమతి మీద భారత్‌ దేశంలో పన్ను చెల్లించికపోయినా ఆమె నివాస దేశమైన థాయ్‌లాండ్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయంపై రెండు దేశాలు పన్నులు వేసే ప్రమాదాన్ని ఈ ఒప్పంద నివారిస్తుంది.

మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్ పాత్ర :- మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో నమోదైన సంస్థ. ఈ బహుమతి నగదు యూకే నుంచి ఇస్తుంది. యూకేలో లాటరీ లేదా బహుమతి నగదుపై పన్ను విధించే నియమం లేదు. అయితే ఈ నగదు ఓపల్ ఖాతాలోకి చేరిన తర్వాత ఆమె నివాస దేశం థాయ్‌లాండ్‌లోని పన్ను చట్టాలు వర్తిస్తాయి. 

అంటే మిస్‌ వరల్డ్ నగదు బహుమతిపై పన్ను ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ నివాస దేశమైన థాయ్‌లాండ్‌ ఖాతాలోకి వెళ్తుంది. థాయ్‌లాండ్‌ పన్ను చట్టాల ప్రకారం, ఈ బహుమతిపై సుమారు 35 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉంది. అంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Asha Bhosle Net Worth: సింగర్ మాత్రమే కాదు.. బిజినెస్ ద్వారా ఆశా భోంస్లేకు భారీగా ఆధాయం.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే
సింగర్ మాత్రమే కాదు.. బిజినెస్ ద్వారా ఆశా భోంస్లేకు భారీగా ఆధాయం.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Home Loan Interest Rates: హోమ్‌లోన్ వడ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంత ఉంది? ఈఎంఐ తగ్గించుకోవడానికి ఐదు చిట్కాలు తెలుసుకోండి!
హోమ్‌లోన్ వడ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంత ఉంది? ఈఎంఐ తగ్గించుకోవడానికి ఐదు చిట్కాలు తెలుసుకోండి!

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration shops: రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
TDP Son Rise: మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
Beat the Heat : రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
Sambhavam Adhyayam Onnu OTT : ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget