Indian Unicorns: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 14 యూనికార్న్‌లను సృష్టించనా భారత్‌, కొత్త యూనికార్న్‌ల విషయంలో చైనాను (కొత్తగా 11) దాటేసింది.


ముచ్చటగా మూడో స్థానం
గ్లోబల్‌గా 1,312 యూనికార్న్‌లు ప్రస్తుతం ఉన్నాయి, ఈ ఆరు నెలల్లో యూనికార్న్‌ల నంబర్‌లో 24% వృద్ధి ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ కంపెనీల్లో దాదాపు సగం వాటా అమెరికాదే. 625 యునికార్న్‌లతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో ఉంది. 312 యూనికార్న్‌లతో చైనా రెండో స్థానంలో, 68 యూనికార్న్‌లతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. యూకే (48), జర్మనీ 36, ఇజ్రాయెల్‌ (24), ఫ్రాన్స్‌ (23), కెనడా (21), బ్రెజిల్‌ (17), దక్షిణ కొరియా (15) టాప్‌ -10లోని మిగిలిన దేశాలు.


చైనాకు చెందిన Douyin 200 బిలియన్‌ డాలర్లతో ప్రపంచ యూనికార్న్‌లలో అగ్రస్థానంలో ఉంది. అమెరికాకు చెందిన SpaceX 125 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో, చైనాకు చెందిన Ant Group 120 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికాకు చెందిన Stripe 62 బిలియన్‌ డాలర్లతో నాలుగో ప్లేస్‌లో, చైనాకు చెందిన Shein 60 బిలియన్‌ డాలర్లతో ఐదో ప్లేస్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, టాప్‌ -10లో ఐదు చైనా కంపెనీలు, మూడు అమెరికా కంపెనీలు, ఒక యూకే కంపెనీ, ఒక మాల్టా దేశపు సంస్థ ఉన్నాయి. ప్రపంచంలోని యునికార్న్‌ల మొత్తం విలువలో, టాప్-10 యునికార్న్‌ల వాటా 17.6%.


ప్రపంచ ర్యాంకుల్లో, మనదేశానికి చెందిన బైజూస్‌ 14వ ప్లేస్‌లో, స్విగ్గీ 45వ ర్యాంకులో, డ్రీమ్‌11 కంపెనీ 75వ నంబర్‌ దగ్గర, ఓయో 91వ స్థానంలో నిలిచాయి. 


నగరాల వారీగా చూస్తే... శాన్‌ఫ్రాన్సిస్కో 176 యునికార్న్‌లతో 'వరల్డ్ యునికార్న్ క్యాపిటల్' టైటిల్‌ను నిలుపుకుంది. బీజింగ్‌ను అధిగమించిన న్యూయార్క్, 120 యునికార్న్‌లతో రెండవ స్థానంలో నిలిచింది. 90 యునికార్న్‌లతో బీజింగ్ మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత 69 యునికార్న్‌లతో షాంఘై నిలిచింది. 39 యునికార్న్‌లతో లండన్ ఐదో స్థానంలో ఉండగా, బెంగళూరు & షెన్‌జెన్ తలో 33 యునికార్న్‌లతో ఉన్నాయి.


మన దేశంలో బైజూస్‌ బెస్ట్‌
మన దేశంలోని మొత్తం 68 యూనికార్న్‌ కంపెనీల్లో (కొత్తవాటితో కలిపి). 22 బిలియన్ డాలర్ల విలువతో, ఆన్‌లైన్ ఎడ్యుకేటర్ బైజూస్‌ తొలి స్థానంలో ఉంది. ఆన్ డిమాండ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ ($11 బిలియన్లు), ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11 ($8 బిలియన్లు)తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని హురున్ యూనికార్న్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ 2022 ప్రకారం తెలుస్తోంది. 


2022 తొలి ఆరు నెలల్లో, బెంగళూరు 5 కొత్త యునికార్న్‌లను జోడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో ఈ నగరానిది 2.5 శాతం వాటా.


విదేశాల్లోనూ భారత జెండా 
భారతదేశం వెలుపల కూడా భారతీయులు సత్తా చాటారు. భారతీయులు కో ఫౌండర్లుగా విదేశాల్లో 56 యునికార్న్‌లను ప్రారంభించారు. వీటితో కలిపి, మొత్తం 124 యునికార్న్‌లను ప్రపంచవ్యాప్తంగా భారతీయులు స్థాపించారు. భారతదేశం వెలుపల ఉన్న యునికార్న్‌లలో ఎక్కువ భాగం USలో (51) ఉన్నాయి. UKలో 2, జర్మనీ, సింగపూర్, మెక్సికోలో ఒక్కొక్కటి ఉన్నాయి. 


రెడీగా ఉన్న స్టార్టప్‌లు 
హురున్ గ్లోబల్ గజెల్ ఇండెక్స్ 2022 అర్ధ సంవత్సర నివేదిక ప్రకారం, వచ్చే మూడేళ్లలో భారతదేశంలోని 44 స్టార్టప్‌లు యునికార్న్‌లుగా మారుతాయి. అంటే మూడేళ్లలో $1 బిలియన్ల విలువను తాకనున్నాయి. 2000 సంవత్సరాల్లో స్థాపించిన కంపెనీలను Gazellesగా పిలుస్తున్నారు. వీటి విలువ ప్రస్తుతం $500 మిలియన్లకు పైగా ఉంది, ఇవి ఇంకా పబ్లిక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ కాలేదు. హురున్ గ్లోబల్ గెజెల్ ఇండెక్స్ ప్రకారం... 33 దేశాల్లోని 151 నగరాల్లో 621 గెజెల్‌లు ఉన్నాయి. అమెరికా 238, చైనా 200 గెజెల్స్‌తో ఇండెక్స్‌లో ముందంజలో ఉన్నాయి, ప్రపంచ గెజెల్స్‌లో వీటిదే 70 శాతం వాటా. 


యునికార్న్‌ పెట్టుబడుల్లో గోల్డెన్ హ్యాండ్స్‌
సీక్వోయా 234 యునికార్న్‌లలో పెట్టుబడి పెట్టి, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన యునికార్న్ పెట్టుబడిదారుగా టైటిల్‌ నిలుపుకుంది. గత ఇండెక్స్ కంటే ఈసారి 28 సంస్థల్లో పెట్టుబడులు పెంచింది. సాఫ్ట్‌బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో 180 యునికార్న్‌లు ఉన్నాయి, రెండో అత్యంత విజయవంతమైన పెట్టుబడి కంపెనీ ఇది. టైగర్ పోర్ట్‌ఫోలియోలో 169 యునికార్న్‌లతో మూడో స్థానంలో ఉంది. 90 యునికార్న్‌లలో వాటాతో టెన్సెంట్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు పెట్టుబడి కంపెనీలు కలిసి ప్రపంచంలోని దాదాపు 44% యునికార్న్‌లలో పెట్టుబడి పెట్టాయి.