Gold vs Real Estate: మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. గత నాలుగైదు ఏళ్ల నుంచి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలోనూ ఇన్వెస్ట్ చేయడం పెరిగింది. బంగారం, రియల్ ఎస్టేట్ అనేది బెస్ట్ ఆప్షన్లుగా చాలా మంది భావిస్తారు. ఇందులో దేనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దీర్ఘకాలంలో ఎక్కువ లాభం పొందవచ్చు అనే సందేశాలు ఉంటాయి. గత సంవత్సరంలో బంగారం, రియల్ ఎస్టేట్ రెండింటి ధరలు అద్భుతంగా పెరిగాయి. ఆర్థిక అనిశ్చితి, (US Tariffs) సుంకాలు, సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోలు చేయడం లాంటి కారణాలతో సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ధరలు పెరగడంతో బంగారం మంచి ఇన్వెస్ట్ ఆప్షన్‌గా చూస్తున్నారు. అదే సమయంలో గృహనిర్మాణంలో డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం, లగ్జరీ విభాగంలో డిమాండ్ కారణంగా రియల్ ఎస్టేట్ విలువ కూడా కొన్ని నగరాల్లో పెరిగింది. చాలా చోట్ల కొనుగోళ్లు తగ్గినా, ధర మాత్రం దిగి రాలేదు.
బంగారంలో పెట్టుబడితో కలిగే ప్రయోజనాలు
బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఈజీగా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. ఆర్థిక అనిశ్చితి సమయంలో లేదా స్టాక్ మార్కెట్ పడిపోయిన సమయంలోనూ బంగారం సేఫ్ ప్రాపర్టీగా ఉండి ఆస్తిగా నష్టాన్ని నివారిస్తుంది. మీరు ఫిజికల్ గోల్డ్‌తో పాటు డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ సెబీ పర్మిషన్ ఉన్న సంస్థలు, బ్రాండ్లలో మాత్రమే డిజిటల్ గోల్డ్, ఈ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. బంగారం కొనడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అత్యవసర పరిస్థితుల్లో, మీరు మీ బంగారాన్ని అమ్మి నగదుగా మార్చుకుని, మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడితో కలిగే ప్రయోజనాలు
రియల్ ఎస్టేట్‌లో మీరు దీర్ఘకాలంలో లాభం పొందవచ్చు. అయితే మీరు దీనిపై పెట్టుబడితో నెలవారీ కొంత నగదు సంపాదించవచ్చు. మీరు మీ ఆస్తిని అద్దెకు లేదా లీజుకు ఇవ్వడం ద్వారా ఆర్జించవచ్చు. నాణ్యమైన గృహనిర్మాణానికి డిమాండ్ పెరుగుతున్న తీరును గమనిస్తే రాబోయే 8-10 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. మీరు EMI ద్వారా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు మరియు కొన్ని సంవత్సరాలలో రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత, ఆస్తి మీ పేరు మీదకు వచ్చినప్పుడు మరియు తరువాత ఆస్తి విలువ పెరిగినప్పుడు మీరు ప్రయోజనం పొందవచ్చు. మీరు కాలక్రమేణా అద్దెను కూడా పెంచవచ్చు.
దేనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లాభం?
క్యాష్ అనేది త్వరగా అవసరం పడుతుంది అంటే.. బంగారంలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు దీర్ఘకాలంలో లాభం పొందాలనుకుంటే, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు గృహ రుణాల(Home Loan)పై ఆస్తిని కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా EMI చెల్లించాలి. అయితే బంగారం విషయంలో అలాంటిదేమీ లేదు. ప్రారంభ సంవత్సరాల్లో మీరు EMI భారాన్ని భరిస్తే సరి. కానీ తరువాత ఆస్తి విలువ, అద్దె పెరిగినప్పుడు, EMIలో ఎక్కువ భాగం కవర్ అయి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Gold Investment: డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి సెబీ హెచ్చరిక.. వినకపోతే రిస్క్ తప్పదు