ప్రముఖ టెలికాం సంస్థ Vi 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఒకే రీఛార్జ్‌తో ప్రీమియం సంగీతం, వినోదం, అధునాతన డేటా ప్రయోజనాలను పొందేలా ఈ ప్లాన్లు, మ్యూజిక్ ఆఫర్‌తో వస్తున్న అత్యంత పొదుపుగా ఉన్నాయి. యువతలో డిజిటల్ కనెక్టివిటీని పెంచడంలో మ్యూజిక్ కీలకం అని, దీనిని దృష్టిలో ఉంచుకుని Vi తన ఫ్లాగ్‌షిప్ ప్రీపెయిడ్ ప్లాన్లలో స్పాటిఫై ప్రీమియం యాడ్ చేసింది. వినియోగదారులు ఎలాంటి ప్రకటనల అంతరాయం లేకుండా పాటలు వినడం, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌ చేసుకోవడం, అత్యుత్తమ ఆడియో క్వాలిటీతో ప్రీమియం మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను మరింత సులభంగా పొందే అవకాశం లభిస్తుంది.
 
అధిక డేటా, ఎంటర్‌టైన్మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారుల కోసం Vi రూ.435 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫ్లాగ్‌షిప్ Vi నాన్‌-స్టాప్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పాటిఫై ప్రీమియం పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో అపరిమిత 4G/5G డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో హాట్‌స్టార్ (మొబైల్) సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. ఎక్కువగా కంటెంట్ చూసే వారికి ఒకే రీఛార్జ్‌తో ప్రీమియం మ్యూజిక్, వినోదం, నిరంతర కనెక్టివిటీని అందిస్తున్న ప్లాన్ గా మారుతుంది. 
 
ప్రీమియం మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను అందరికీ చేరువ చేస్తూ, Vi రూ.250 ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది. 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పాటిఫై ప్రీమియంతో పాటు 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMSలు లభిస్తాయి.
 
అదనపు టాపప్ ప్యాక్ కోరుకునే వినియోగదారుల కోసం రూ.230 ప్యాక్‌ తీసుకొచ్చింది. ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా స్పాటిఫై ప్రీమియంతో పాటు జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్, ఫ్యాన్ కోడ్, లయన్స్ గేట్ ప్లే సహా 20కి పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ ప్యాక్‌లో 30GB హై-స్పీడ్ డేటా పొందుతారు. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు వినియోగదారులు సంబంధిత ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. 
 
ఆ తర్వాత Vi యాప్‌లోని యాక్టివ్ సర్వీసెస్ కింద ఉన్న Claim Benefits పేజీకి వెళ్లి, స్పాటిఫై ప్రీమియం పక్కన ఉండే Claimపై క్లిక్ చేయాలి. తరువాత తమ స్పాటిఫై ఖాతాలోకి సైన్ ఇన్ అవ్వడం లేదా కొత్త అకౌంట్ ప్రారంభించడం ద్వారా ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మీరు వెంటనే యాక్టివేట్ చేసుకోవచ్చు.
 
స్పాటిఫై ప్రీమియం బెనిఫిట్ అనేది Vi రీఛార్జ్ వ్యాలిడిటీతో ముడిపడి ఉంటుంది. ప్లాన్ గడువు ముగిసిన తర్వాత తిరిగి తగిన ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లు ప్రకటనలు లేని మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు. Vi వినియోగదారులు తమ పాత స్పాటిఫై ఖాతా వివరాలతో లేదా కొత్త ఖాతాను క్రియేట్ చేయడం ద్వారా Vi యాప్ సహాయంతో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. 
 
ఈ సరికొత్త ఆఫర్ ద్వారా Vi ఎంటర్‌టైన్మెంట్‌కు సంబంధించిన సేవలను మరింత బలోపేతం చేసింది. ఇప్పటికే విభిన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ద్వారా నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5 వంటి OTT ప్లాట్‌ఫాంలకు Vi యాక్సెస్ ఇస్తోంది. ఇప్పుడు స్పాటిఫై ప్రీమియం సేవలు అందుబాటులోకి రావడంతో వీఐ కస్టమర్లు మరిన్ని సేవలు పొందుతారు.