Varun Beverages: వేసవి వస్తోందంటే ఏసీలు, కూలర్లు, బేవరేజెస్ స్టాక్స్ మార్కెట్ ఫోకస్‌లోకి వస్తాయి. ఈ కంపెనీలకు వేసవి కాలమే పీక్ సేల్స్ సీజన్.
బేవరేజ్ స్టాక్ అయిన వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ (VBL) గత 12 నెలల్లో (గత ఏడాది కాలం) 112% రాబడిని ఇచ్చి మల్టీబ్యాగర్‌గా మారింది. ఇదే కాలంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ ఇచ్చిన రాబడి కేవలం 1.9%.
బేవరేజెస్ ఇండస్ట్రీలో VBL ఒక కీలక కంపెనీ. US బయట 'పెప్సికో' (PepsiCo)కు ఉన్న అతి పెద్ద ఫ్రాంఛైజీల్లో ఇది ఒకటి. బ్రోకరేజ్ షేర్‌ఖాన్ అంచనాల ప్రకారం ఈ స్టాక్‌కు ఇంకా 24% అప్‌సైడ్ పొటెన్షియల్ ఉంది. అయితే, ఇది మరింత పైకి ఎగబాకడానికి ఒక అడ్డంకి కూడా ఉంది.
నిన్న (గురువారం), 2.65% లాభంతో రూ. 1,306 వద్ద ముగిసిన వరుణ్ బెవరేజెస్ షేర్లు, ఇవాళ (శుక్రవారం, మార్చి 17 2023) ఉదయం 10.45 గంటల సమయానికి దాదాపు ఫ్లాట్‌గా రూ. 1,301.65 వద్ద ఉన్నాయి.
వరుణ్ బెవరేజెస్‌కు బయ్ రేటింగ్స్
సెంట్రమ్ బ్రోకింగ్ ఎనలిస్ట్ నీలేష్ జైన్ ఈ స్టాక్‌కు రూ. 1380 ఇమ్మీడియెట్ టార్గెట్ ప్రైస్‌తో "బయ్" రేటింగ్ ఇచ్చారు. ఈ కౌంటర్ మరో 5% లాభాలను కళ్లజూడగలదని ఈ టార్గెట్ ధర అర్ధం. డిప్స్‌లో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని ఎనలిస్ట్ సూచించారు. దీనికి రూ.1,380 వద్ద ప్రతిఘటన (resistance) ఉంది.
షేర్‌ఖాన్ కూడా వరుణ్ బెవరేజెస్‌కు "బయ్" రేటింగ్ ఇచ్చింది. రాబోయే 12 నెలల్లో మరో 24% పెరుగుదలకు అవకాశం ఉందని వెల్లడించింది.
నిలకడ ఉన్న స్టాక్
గత ఒక సంవత్సర కాల బీటా 0.69తో, తక్కువ అస్థిరతను ఈ స్టాక్ ప్రదర్శించింది. ఎక్కువ అస్థిరత ఉన్న స్టాక్స్‌తో (బీటా 1.0 కంటే ఎక్కువ ఉంటే) ఎక్కువ రిస్క్ ఉంటుంది. బీటా 1.0 కంటే తక్కువగా ఉంటే, వాటిని నిలకడ ఉన్న స్టాక్స్‌గా మార్కెట్ లెక్కిస్తుంది.
Trendlyne డేటా ప్రకారం... మొమెంటం సూచీలు RSI, MFI వరుసగా 59.1 & 65.9 వద్ద మధ్యస్థ పరిధిలో ఉన్నాయి. ఈ సంఖ్య 30 కంటే తక్కువగా ఉంటే, ఆ స్టాక్ 'ఓవర్‌సోల్డ్' ప్రాంతంలో ట్రేడ్ అవుతుందని భావిస్తారు. 70 కంటే ఎక్కువ ఉంటే అది 'ఓవర్‌బాట్' జోన్‌లో ఉందని భావిస్తారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో, ప్రస్తుత సీజన్‌లో (Q1 & Q2CY23లో) బలమైన రెండంకెల రాబడి, ఆదాయ వృద్ధిని పోస్ట్ చేయగలమని వరుణ్ బెవరేజెస్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. కంపెనీ ఉత్పత్తుల్లో కీలకమైన కార్బోనేటేడ్ డ్రింక్స్/కొత్త ఉత్పత్తుల సామర్థ్యాన్ని దాదాపు 30% పెంచడం ద్వారా & పాల పానీయాల (dairy beverages) వంటి కొత్త కేటగిరీల సామర్థ్యాలను మూడు రెట్లు పెంచడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంపై మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది. మీడియం - దీర్ఘకాలంలో బలమైన ఆదాయ అవకాశాలను ఇది సృష్టించే అవకాశం ఉంది.
కీలక రిస్క్‌లు
సానుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఏదైనా కారణం వల్ల బేవరేజెస్ డిమాండ్ తగ్గినా, కార్బోనేటేడ్ డ్రింక్స్ విధానంలో మార్పు లేదా పన్నులు పెరిగినా కీలక ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడుతుంది. కీలక ముడి పదార్థాల ధరలు పెరిగినా కంపెనీ లాభదాయకత తగ్గే అవకాశం ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.