UPI Subsidy: యూపీఐ (UPI) డిజిటల్ పేమెంట్స్ దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే, యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలులోకి రానుండడంతో వినియోగదారుల్లో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. యూపీఐ ఫ్రీ ట్రాన్‌జాక్షన్స్ నిలిచిపోతాయా? సబ్సిడీలు ఏమవుతాయి? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. ఎండీఆర్ అమల్లోకి వచ్చినప్పటికీ యూపీఐ సబ్సిడీని పూర్తిగా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, దీనికోసం ఒక కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

Continues below advertisement

అక్టోబర్ 15 నుంచి కొత్త రూల్స్  

అక్టోబర్ 15, 2026 నుంచి రూ. 2,000 పైబడిన వ్యాపార లావాదేవీలపై 0.4% MDR వర్తించే అవకాశం ఉంది. అయితే, ఈ భారాన్ని సామాన్య ప్రజలపై మోపబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్సన్ టు పర్సన్ యూపీఐ లావాదేవీలకు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితమని తెలిపింది. సామాన్యులు లేదా రోజువారీ వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.

సబ్సిడీలపై ప్రణాళికేంటి?

MDR అమలులోకి వచ్చినప్పటికీ, డిజిటల్ పేమెంట్స్ మౌలిక వసతుల కల్పన, నిర్వహణ,  పర్యవేక్షణ ఖర్చులను ఆ ఆదాయంతో మాత్రమే పూర్తిగా భరించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం, బ్యాంకులు జాయింట్  సబ్సిడీ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ తగిన నిధులను కేటాయించడం ద్వారా వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీర్ఘకాలిక మనుగడ కోసం ఎండీఆర్, ప్రభుత్వ సబ్సిడీ రెండింటినీ సమన్వయం చేస్తూ ఒక కొత్త వ్యవస్థను తీసుకురానున్నారు.Also Read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తేదీలు ఖరారు.. అక్టోబర్ 8 నుంచి సేల్ స్టార్ట్

Continues below advertisement

రూ. 2,000 వరకు లావాదేవీలు 

వ్యాపారులకు చేసే రూ. 2,000 లోపు చెల్లింపులపై ఎలాంటి MDR వర్తించదు. నిత్యావసరాలు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, క్యాబ్ ఛార్జీలు వంటి చిన్న కొనుగోళ్లపై ఎలాంటి కొత్త ఛార్జీలు ఉండవు. షాపుల కస్టమర్ల నుంచి ఎండీఆర్ పేరుతో ఎటువంటి అదనపు వసూళ్లు చేయడానికి వీలులేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగదారుల నుంచి నేరుగా ఈ ఫీజు వసూలు చేయరు. Also Read: పర్సనల్ లోన్ అర్హత, వడ్డీ రేట్లు, ఈఎంఐ, డాక్యుమెంట్స్, రీపేమెంట్ పూర్తి వివరాలు

యూపీఐ వ్యయం ఎంత?

దేశంలో యూపీఐ నిర్వహణలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ వంటి వాటిపై భారీ ఖర్చు అవుతోంది. ప్రభుత్వ అంచనాల మేరకు ప్రస్తుత యూపీఐ వ్యవస్థను సజావుగా నడపడానికి ఏడాదికి సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు అవుతుంది. అందుకే, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిరంతరం కొనసాగేందుకు, బ్యాంకులు ఫిన్‌టెక్ సంస్థలకు తగిన మద్దతు ఇస్తూ సబ్సిడీలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: వ్యాపారులు యూపీఐ పేమెంట్స్ నిరాకరించవచ్చా?.. కొత్త MDR రూల్స్ ఏం చెబుతున్నాయి?