Fixed Deposit Rates: ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ ఏడాది ఐదు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. రెపో రేటు 4.00 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. 2022 డిసెంబర్ 7న జరిగిన సమావేశంలో పెంచిన రేటుతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఈ పెరుగుదల బ్యాంకు ఖాతాదారులపైనా ప్రభావం చూపింది. చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రెండు బ్యాంకుల పేర్లు చేరాయి. అవి... సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, DCB బ్యాంక్.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD రేట్లు పెంపు (Suryoday Small Finance Bank FD Rates)
రూ. 2 కోట్ల కంటే తక్కువ FDల మీద వడ్డీ రేటును పెంచాలని సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంక్ కొత్త రేట్లు 21 డిసెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. వడ్డీ రేటు పెంపు తర్వాత, సాధారణ ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాల పరిమితి ఉన్న FDలపై 4.00 శాతం నుంచి 6.00 శాతం వరకు వడ్డీ రేటును ఈ బ్యాంక్ అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 999 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద గరిష్ట వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఈ కాల వ్యవధి డిపాజిట్ల కోసం, సాధారణ పౌరులకు 8.51 శాతం - సీనియర్ సిటిజన్లకు 8.76 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది.
7 రోజుల నుంచి 14 రోజుల FD – 4.00%
15 రోజుల నుంచి 45 రోజుల FD - 4.25 శాతం
46 రోజుల నుంచి 90 రోజుల FD - 4.50 శాతం
91 రోజుల నుంచి 6 నెలల వరకు FD – 5.00%
6 నెలల నుంచి 9 నెలల వరకు FD - 6.00 శాతం
9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు FD - 6.00 శాతం
1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 6 నెలల వరకు FD – 7.00%
1 సంవత్సరం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు FD - 8.01 శాతం
2 సంవత్సరాల నుంచి 998 రోజుల వరకు FD - 7.51 శాతం
999 రోజుల FD – 8.51%
32 నెలల 27 రోజుల నుంచి 3 సంవత్సరాల వరకు FD - 7.25 శాతం
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు FD - 6.75 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు FD - 6.00 శాతం
DCB బ్యాంక్ FD రేట్లు పెంపు (DCB Bank FD Rates)
DCB బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల కంటే తక్కువ FDలపై వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించింది. బ్యాంక్ కొత్త రేట్లు 21 డిసెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ బ్యాంక్, తన సాధారణ ఖాతాదారులకు 3.75 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం నుంచి 8.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు గరిష్టంగా 7.85 శాతం - సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.35 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. వివిధ కాలావధుల కోసం DCB బ్యాంక్ (సాధారణ కస్టమర్లకు) అందిస్తున్న ఈ వడ్డీ రేట్లు ఇవి:
7 రోజుల నుంచి 45 రోజుల FD – 3.75%
46 రోజుల నుంచి 90 రోజుల FD – 4.00%
91 రోజుల నుంచి 6 నెలల వరకు FD – 4.75%
6 నెలల నుంచి 12 నెలల వరకు FD – 6.25%
12 నెలల నుంచి 18 నెలల వరకు FD- 7.25%
18 నెలల నుంచి 700 రోజుల FD – 7.50%
700 రోజుల నుంచి 36 నెలల వరకు FD - 7.85 శాతం
36 నెలల నుంచి 120 నెలల వరకు FD - 7.60 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచి, పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.