Stocks to watch 13 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో ఐటీ సెక్టార్
మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 13 October 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 58.5 పాయింట్లు లేదా 0.34 శాతం రెడ్ కలర్‌లో 17,046.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: ఇన్ఫోసిస్, మైండ్‌ట్రీ, ఏంజెల్ వన్, ఏంజెల్ వన్, సైయంట్, ఆనంద్ రాఠీ వెల్త్, డెన్ నెట్‌వర్క్స్, ఆదిత్య బిర్లా మనీ, అల్‌స్టోన్ టెక్స్‌టైల్స్ (ఇండియా), రోజ్‌లాబ్స్ ఫైనాన్స్, అథర్వ్ ఎంటర్‌ప్రైజెస్.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
విప్రో: IT సర్వీసెస్ మేజర్ విప్రో సెప్టెంబర్ త్రైమాసిక నికర లాభం 9.3 శాతం తగ్గింది. సిబ్బంది ఖర్చులు పెరగడం, యుఎస్‌యేతర ఆదాయాలు తగ్గడం వంటి అంశాలు లాభం మీద ఒత్తిడి పెంచాయి. ఈ త్రైమాసికంలో రూ.2,659 కోట్ల లాభాన్ని సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,930 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
HCL టెక్నాలజీస్: ఈ IT కంపెనీ సెప్టెంబర్ త్రైమాసిక ఏకీకృత నికర లాభం 7 శాతం వృద్ధి చెందింది, రూ.3,489 కోట్లకు చేరుకుంది. దలాల్ స్ట్రీట్ అంచనాల కంటే ఇది ఎక్కువ. ప్రపంచ స్థాయి ఆందోళనలు ఉన్నప్పటికీ బలమైన డిమాండ్, డీల్ పైప్‌లైన్ ప్రాతిపదికన పూర్తి ఆర్థిక సంవత్సర ఆదాయ మార్గదర్శకాలను కంపెనీ మేనేజ్‌మెంట్ పెంచింది.
ITC: తన అనుబంధ సంస్థ అయిన ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా (ITC Infotech India) ద్వారా బ్రెజిల్‌లో ఒక అనుబంధ సంస్థను (స్టెప్ డౌన్ సబ్సిడియరీ) స్థాపించింది. దాని పేరు ఐటీసీ ఇన్ఫోటెక్ డో బ్రసిల్ ఎల్‌టీడీఏ (ITC Infotech Do Brasil LTDA).
పవర్ గ్రిడ్ కార్పొరేషన్: ఈ ప్రభుత్వ రంగ సంస్థలో తనకున్న పెట్టుబడుల్లో 2 శాతానికి పైగా వాటాను 3,079.43 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు LIC తెలిపింది. ఈ ఏడాది మే 18 నుంచి అక్టోబర్ 11 మధ్య కాలంలో (ఐదు నెలల్లో), LIC హోల్డింగ్‌లో 2.003 శాతం తగ్గుదల కనిపించింది.
టాటా పవర్: టాటా మోటార్స్ కోసం పంత్‌నగర్‌లో 7 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ టాటా గ్రూప్స్ సంస్థ తెలిపింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 215 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది, 1.7 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది.
భెల్ (BHEL): కోల్ గ్యాసిఫికేషన్ ఆధారిత ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకు కోల్ ఇండియా, ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌తో రెండు వేర్వేరు ఒప్పందాలను భెల్ కుదుర్చుకుంది.
PVR, ఐనాక్స్ లీజర్: ఐనాక్స్ లీజర్‌తో విలీనానికి తమ వాటాదారుల నుంచి అనుమతి లభించిందని మల్టీప్లెక్స్ ఆపరేటర్ PVR తెలిపింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముంబై బెంచ్ ఆదేశాల మేరకు మంగళవారం తన వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
అదానీ విల్మార్: ఎడిబుల్ ఆయిల్ రేట్ల తగ్గుదల కారణంగా, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం తక్కువ ఏక అంకెలో పెరుగుతుందని అదానీ విల్మార్ అప్‌డేట్ చేసింది. తన ఎడిబుల్ ఆయిల్స్, ఇతర ఆహార పదార్థాలను ఫార్చ్యూన్ (Fortune) బ్రాండ్ క్రింద ఈ కంపెనీ మార్కెట్ చేస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.