News
News
X

Stocks to watch 11 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అందరి ఫోకస్‌ TCS మీదే

మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
 

Stocks to watch today, 11 October 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 43.5 పాయింట్లు లేదా 0.25 శాతం రెడ్‌ కలర్‌లో 17,184.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

డెల్టా కార్ప్, GM బ్రూవరీస్: డెల్టా కార్ప్, GM బ్రూవరీస్, ట్రైడెంట్ టెక్సోఫాబ్, సుప్రీమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గుజరాత్ హోటల్స్, చోక్సీ ఇమేజింగ్ ఇవాళ తమ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): సెప్టెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధితో రూ.10,431 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మార్జిన్లలో తగ్గుదల కారణంగా తక్కువ లాభాన్ని పొందింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 18 శాతం పెరిగి రూ. 55,309 కోట్లకు చేరాయి, గత ఏడాది కాలంతో ఇది రూ.46,867 కోట్లు.

News Reels

యాక్సిస్ బ్యాంక్: GVK పవర్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగమైన GVK పవర్ (Goindwal Sahib) మీద యాక్సిస్ బ్యాంక్ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ స్వీకరించింది.

ఇన్ఫోసిస్: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఈ ఐటీ మేజర్ వెల్లడించింది. ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను గురువారం జరగనున్న సమావేశంలో కంపెనీ బోర్డు పరిశీలిస్తుంది.

బజాజ్ ఆటో: షేర్ బైబ్యాక్ కింద రూ.2,499.97 కోట్లను వెచ్చించి పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి 64 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ తెలిపింది. ఈ ఏడాది జులై 4న షేర్ల బైబ్యాక్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. బైబ్యాక్ కసరత్తు ముగింపుకు సోమవారం జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపింది.

అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్ ఎకనామిక్ జోన్స్‌ ‍‌(APSEZ): ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో (GPL) మిగిలిన 58.1 శాతం వాటాను 'కాంపోజిట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌' ద్వారా కొనుగోలు చేయడానికి NCLT అహ్మదాబాద్, NCLT హైదరాబాద్ బెంచ్‌ల నుంచి అనుమతులు పొందింది. 58.1 శాతం వాటా కొనుగోలు పూర్తయితే GPLలో APSEZకు 100 శాతం వాటా పూర్తవుతుంది.

అదానీ గ్రీన్ ఎనర్జీ: ఐనాక్స్ విండ్, తన అనుబంధ సంస్థ అయిన ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీలో ఉన్న తన మొత్తం ఈక్విటీ వాటాను అదానీ గ్రీన్‌ ఎనర్జీకి విక్రయించింది. 

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) మాజీ హెడ్ RV వర్మను తన నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఈ ప్రైవేట్ లెండర్ నియమించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇండియా సిమెంట్: స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (SMPL) తన మొత్తం వాటాను JSW సిమెంట్‌కు రూ.476.87 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సిమెంట్ ప్లేయర్ తెలిపింది. SMPLకు పన్నా జిల్లాలో సున్నపురాళ్ల భూములు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది.

IDBI బ్యాంక్: MSMEలకు డిజిటల్ సప్లై చైన్ ఫైనాన్సింగ్‌ను అందించేందుకు, తన ఫిన్‌టెక్ భాగస్వామిగా వే నెట్‌వర్క్ సర్వీసెస్‌తో (Vay Network Services) ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. కొనుగోలుదారు, విక్రేత, రుణ సంస్థను ఒకే వేదిక పైకి తీసుకొచ్చే ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ వే నెట్‌వర్క్.

వికాస్ లైఫ్‌కేర్: ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లేయర్, పాన్ ఇండియా స్థాయిలో తన రిటైల్ ఫుట్‌ప్రింట్‌ను విస్తరించడానికి రూ.15 కోట్లతో 'అర్ద్ సైనిక్ క్యాంటీన్స్'లో (Ardh Sainik Canteens) 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. తన ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచే ఈ వాటాను కొనుగోలు చేసింది. మార్చి 28, 2023 నాటికి ఈ డీల్ పూర్తిగా అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 11 Oct 2022 08:29 AM (IST) Tags: Share Market Stocks to watch stocks in news Stock Market

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు