Diwali Muhurat Trading 2025 Top stocks: దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో 'ముహూరత్ ట్రేడింగ్' కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ఏడాది ముహూర్త ట్రేడింగ్ అక్టోబర్ 21న అంటే ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 1.45 నుండి 2.45 మధ్యలో నిర్వహించనున్నారు. వాస్తవానికి ప్రతి ఏడాది దీపావళి రోజున స్టాక్ మార్కెట్‌లో ఒక గంట పాటు నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఈ సమయంలో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ను శుభప్రదంగా భావిస్తారు. ఇది కొత్త సంవత్సరం ప్రారంభంగా కూడా కొందరు భావిస్తారు. అసిత్ సి మెహతా ఇన్వెస్ట్‌మెంట్ ఇంటర్మీడియట్స్ (ACMIIL) ముహూరత్ ట్రేడింగ్ సమయంలో పెట్టుబడిదారులకు లాభాలను అందించే అవకాశం ఉన్న కొన్ని  స్టాక్‌లను సూచించారు. సం. మహూరత్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్‌లను ఒకసారి చూద్దాం.

Continues below advertisement

అదానీ పోర్ట్స్ & SEZ

అదానీ పోర్ట్స్, రైల్వేలు, స్పెషల్ ఎకనమిక్ జోన్ల (SEZ)లో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సేవలను అందిస్తుంది. భారతదేశంతో పాటు ఈ అదానీ కంపెనీ ఇజ్రాయెల్, శ్రీలంక, టాంజానియా వంటి దేశాలలో సేవలు అందిస్తుంది. 'సాగరమాల', గతి శక్తి వంటి ప్రభుత్వ కార్యక్రమాల సహాయంతో కంపెనీ వృద్ధి, వ్యయ సామర్థ్యం పటిష్ట స్థితిలో ఉంది. బ్రోకరేజ్ రూ. 1,591 టార్గెట్ ప్రైజ్ ను ఇస్తూ దీనిని పరిశీలించాలని అని సిఫార్సు చేశారు. ఇది స్టాక్ ప్రస్తుత ధర కంటే 8.6 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

టిటాగఢ్ రైల్ సిస్టమ్స్

టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ షేర్‌ను కూడా కొనే వాటిలో పరిశీలించాలని బ్రోకరేజ్ సంస్థ అని సిఫార్సు చేసింది. అదే సమయంలో షేరుకు రూ.1,072 టార్గెట్ రేట్ నిర్ణయించారు. ప్రస్తుత ధరతో పోల్చితే ఇది 21 శాతం పెరుగుదలను సూచిస్తుంది. భారతీయ రైల్వేల వేగవంతమైన ఆధునికీకరణ సమయంలో సరుకు రవాణా కారిడార్ విస్తరణ వంటి చర్యలు టిటాగఢ్ రైల్ సిస్టమ్స్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. దీని వాగన్ వార్షిక సామర్థ్యం 12,000, ఇంటిగ్రేటెడ్ ఫౌండ్రీ దాని విస్తరణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. రూ. 26,000 కోట్ల స్ట్రరంగ్ ఆర్డర్ బుక్‌తో స్టాక్ పటిష్ట స్థితిలో ఉంది. వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లలో పెరుగుతున్న పెట్టుబడులతో, కంపెనీ రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయి. 

Continues below advertisement

పాలీక్యాబ్ ఇండియా

ACMIIL పాలీక్యాబ్ ఇండియా షేర్‌కు మంచి రేటింగ్ ఇచ్చింది. దీని టార్గెట్ ధర రూ. 8,440 గా నిర్ణయించింది. ప్రస్తుత ధరతో పోల్చితే ఇది 10 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పాలీక్యాబ్ భారతదేశంలో వైర్లు, కేబుల్స్ తయారు చేసే అతిపెద్ద కంపెనీలలో ఒకటి.

లార్సెన్ & టూబ్రో

బ్రోకరేజ్ లార్సెన్ & ట్రూబ్రో షేర్‌కు బ్రోకరేజ్ సంస్థ 'accumulate' రేటింగ్ ఇచ్చింది. 4,565 రూపాయల లక్ష్య ధరను ఇచ్చింది. L&T దేశంలో ఇంజనీరింగ్ రంగంలో అతిపెద్ద కంపెనీ. దీని ఆర్డర్ బుక్ వార్షిక ఆదాయం కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, డిజిటల్ సొల్యూషన్స్‌లో దీని విస్తరణ పలు రంగాలలో కంపెనీ వృద్ధికి సంకేతం. కంపెనీ క్రమంగా డేటా సెంటర్,  సెమీకండక్టర్ విభాగంలో తన పరిధిని విస్తరిస్తోంది. 

సిప్లా

సిప్లా స్టాక్ కు 'accumulate' రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధరను 1,808 రూపాయలుగా నిర్ణయించింది. ఇది 10 శాతం ధర పెరుగుదలను సూచిస్తుంది. బయోసిమిలర్స్, కాంప్లెక్స్ ఇంజెక్షన్లు, ప్రత్యేక మందులలో సిప్లా ఆవిష్కరణలు అమెరికా, దక్షిణాఫ్రికా వంటి అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో దాని విస్తరణను సూచిస్తున్నాయి. 

'ముహూర్త ట్రేడింగ్'లో ఏమి చేయాలి?

'ముహూరత్ ట్రేడింగ్' సమయంలో షేర్ల ప్రారంభ ధర గురించి సమాచారం పొందడానికి ప్రీ-ఓపెన్ సెషన్ నేటి మధ్యాహ్నం 1:30-1:45 సమయంలో మొదట ఆర్డర్‌ను బుక్ చేయండి. తరువాత సాధారణ ట్రేడింగ్ ప్రారంభ 30 నిమిషాల్లో (మధ్యాహ్నం 1:45-2:15) షేర్లను కొనవచ్చు. ఆ సమయంలో షేర్లను కొనడం లేదా అమ్మడం సులభం. చివరి 30 నిమిషాల్లో (మధ్యాహ్నం 2:15-2:45) పోర్ట్‌ఫోలియోను మార్చడానికి చిన్న షేర్లపై ఫోకస్ చేయాలి. మంచి లాభం పొందడానికి ఇన్వెస్టర్లు ముందుగానే సిద్ధం కావాలి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ప్రస్తుత రుణాలు, పనితీరు తనిఖీ చేసిన తరువాతే నమ్మదగిన కొన్ని కంపెనీల జాబితాను సిద్ధం చేసిన తరువాతే ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.

Note: (ఇక్కడ అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఎల్లప్పుడూ మార్కెట్ నిపుణుడిని సంప్రదించండి. ABP Desam ఎవరికీ డబ్బు పెట్టుబడి పెట్టాలని సలహాలు ఇవ్వదు.)