Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా మూడో సెషన్లో లాభపడ్డాయి. బెంచ్‌మార్క్ సూచీలు రోజువారీ గరిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సెంటిమెంటు, ఉక్రెయిన్‌లోంచి రష్యా సేనలు వెనక్కి తగ్గడం, శాంతి చర్చలకు పుతిన్ అంగీకరించడం మదుపర్లలో సానుకూల సెంటిమెంటును నిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,500 సమీపంలో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) ఏకంగా 740 పాయింట్లు లాభపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,943 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,362 వద్ద భారీ లాభాల్లోనే మొదలైంది. ఉదయం నుంచీ సూచీకి కొనుగోళ్ల మద్దతు లభించింది. 58,176 వద్ద ఇంట్రాడే కనిష్ఠం నమోదు చేసిన సెన్సెక్స్ 58,727 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 740 పాయింట్ల లాభంతో 58,683 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,325 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,468 వద్ద భారీ గ్యాప్ అప్‌తో ఓపెనైంది. వెంటనే గరిష్ఠ స్థాయిల్లోకి వెళ్లిపోయింది. 17,387 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 17,522 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 172 పాయింట్ల లాభంతో 17,498 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 36,241 వద్ద మొదలైంది. 36,070 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో 36,421 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 486 పాయింట్ల లాభంతో 36,334 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభపడగా 18 నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా స్టీల్ నష్టపోయాయి. ఆటో, ఐటీ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ సూచీలు 1 శాతానికి పైగా ఎగిశాయి. మెటల్ సూచీ మాత్రం 3 శాతం నష్టపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు స్వల్ప నష్టాలు చవిచూశాయి.