Stock Maket update Telugu: భారత స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లలో ఊపు లేదు. బెంచ్‌ మార్క్‌ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (bse sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (nse nifty) రేంజ్‌బౌండ్‌లో ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 57,989 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,198 వద్ద మొదలైంది. ఉదయం నుంచి సూచీ ఫ్లాట్‌గానే ట్రేడ్‌ అవుతోంది. 58,000-58,200 మధ్యే రేంజ్‌బౌండ్‌లో కదలాడుతోంది. 57,836 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ  58,416 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 143 పాయింట్ల నష్టంతో 57,848 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


మంగళవారం 17,315 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,315 వద్ద మొదలైంది. కొనుగోళ్ల ఊపు లేకపోవడంతో రేంజ్‌బౌండ్‌లోనే కదలాడుతోంది. 17,262 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకున్న సూచీ 17,442 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 44 పాయింట్ల నష్టంతో 17,270 వద్ద కదలాడుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంకు 36,627 వద్ద ఆరంభమైంది. 36,214 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 36,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 87 పాయింట్ల నష్టంతో 36,261 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 6 బ్యాంకులు నష్టాల్లో 6 లాభాల్లో ఉన్నాయి.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 22 కంపెనీల షేర్లు లాభపడగా 28 నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్‌, ఐటీసీ, శ్రీసెమ్‌, టెక్‌ మహీంద్రా స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. హీరోమోటో కార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, కొటక్‌ బ్యాంక్‌, బ్రిటానియా నష్టాల్లో ఉన్నాయి. పవర్‌, ఫార్మా, ఐటీ షేర్లు కొనుగోళ్లు చేస్తున్నారు.