Stock Market News: మన దేశంలోని టాప్ 100 లిస్టెడ్‌ కంపెనీల్లో, సగానికి పైగా కంపెనీల షేర్లు ప్రస్తుతం చౌకగా దొరుకుతున్నాయి. ఈ కంపెనీల షేర్ విలువలు వాటి 10-సంవత్సరాల సగటు కంటే ఇప్పుడు తక్కువగా ఉన్నాయి, పెట్టుబడిదార్లకు మంచి ఎంట్రీ పాయింట్లను అందిస్తున్నాయి.

ONGC, టాటా స్టీల్, SBI కార్డ్స్‌, UPL, HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, టాటా పవర్ వంటి స్టాక్స్‌ వాటి దీర్ఘకాలిక సగటు PE నిష్పత్తికి (price to earnings ratio) 25% పైగా డిస్కౌంట్‌తో ప్రస్తుతం ట్రేడ్‌ అవుతున్నాయి. వాల్యుయేషన్‌ ప్రాతిపదికన పెట్టుబడి పెట్టేందుకు దీర్ఘకాలిక PE (పదేళ్ల సగటు PE) పెట్టుబడిదార్లు పరిగణనలోకి తీసుకుంటారు. 

బ్లూంబెర్గ్ ఏకాభిప్రాయ అంచనాల ప్రకారం, వీటిలో చాలా కౌంటర్లు 20% పైగా లాభాలను సంపాదించే అవకాశం ఉంది.

టాటా స్టీల్, గత ఒక సంవత్సర కాలంలో 21% దిద్దుబాటుకు గురైంది. దీంతో, 10 సంవత్సరాల సగటుకు PEకి 48% తగ్గింపుతో ఇప్పుడు లభిస్తుంది. ఏకాభిప్రాయ అంచనాల ప్రకారం, ఈ స్టాక్ 23% రాబడిని ఇస్తుందని భావిస్తున్నారు. టాటా పవర్ కూడా గత ఒక సంవత్సర కాలంలో 23% క్షీణించింది, ఇప్పుడు 26% డిస్కౌంట్‌లో లభిస్తోంది.

"గుడ్‌ బయ్స్‌"గా నిలుస్తాయని విశ్లేషకుల సూచిస్తున్న నాణ్యమైన స్టాక్స్‌ ఇవి:

ఆయిల్‌ & నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ -  ONGCస్టాక్‌ PE: 4.9పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -62గత ఏడాది కాలంలో రిటర్న్‌: -10ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 20.3

టాటా స్టీల్‌ - Tata Steelస్టాక్‌ PE: 7.2పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -48గత ఏడాది కాలంలో రిటర్న్‌: -20.7ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 23

ఎస్‌బీఐ కార్డ్స్‌ - SBI Cardsస్టాక్‌ PE: 31.2పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -39గత ఏడాది కాలంలో రిటర్న్‌: -15ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 30.5

యూపీఎల్‌ - UPLస్టాక్‌ PE: 12.4పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -28.7గత ఏడాది కాలంలో రిటర్న్‌: -8ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 50

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ -  HDFC Asset Management Companyస్టాక్‌ PE: 26.2పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -26.6గత ఏడాది కాలంలో రిటర్న్‌: -25ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 28

టాటా పవర్‌ - Tata Power స్టాక్‌ PE: 19.8పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -26.5గత ఏడాది కాలంలో రిటర్న్‌: -22ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 24

ఐసీఐసీఐ లాంబార్డ్‌ -  ICICI Lombardస్టాక్‌ PE: 32.8పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -25.8గత ఏడాది కాలంలో రిటర్న్‌: -20.7ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 30

వేదాంత - Vedantaస్టాక్‌ PE: 7.1పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -20గత ఏడాది కాలంలో రిటర్న్‌: -32.4ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 26

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ - HDFC Life Insuranceస్టాక్‌ PE: 79పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -9.6గత ఏడాది కాలంలో రిటర్న్‌: -9.3ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 27

హిందాల్కో ఇండస్ట్రీస్‌ - Hindalco industriesస్టాక్‌ PE: 7.8పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -7.7గత ఏడాది కాలంలో రిటర్న్‌: -29ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 33

సిప్లా - Ciplaస్టాక్‌ PE: 27.3పదేళ్ల సగటుకు ప్రస్తుత డిస్కౌంట్‌ %: -3.6గత ఏడాది కాలంలో రిటర్న్‌: -11.3ఎంత శాతం ర్యాలీకి అవకాశం: 26.5

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.