Stock Market News: రిలయన్స్ బిజినెస్‌లో వీక్‌నెస్!, 'సెల్ ఆన్ రైజ్' అవకాశం
ఇటీవలి ధర పతనంతో ఇప్పుడు ఈ స్టాక్ విలువ చౌకగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Reliance Industries Shares: ఇండియన్ స్టాక్ మార్కెట్లలోని బ్లూచిప్ స్టాక్స్‌లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎంతటి అల్లకల్లోన్నైనా తట్టుకుని నిలబడే ఈ క్వాలిటీ స్టాక్ ప్రస్తుతం అమ్మకాల ఒత్తిడితో అల్లాడుతోంది.
విదేశీ ఇన్వెస్టర్ల (FIIs) విక్రయాలు, కంపెనీ చేపట్టిన కొత్త వ్యాపారాల్లో వృద్ధిపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో.. భారత్‌లోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం (20 మార్చి 2023) 19 నెలల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. సోమవారం నాడు స్టాక్ దాదాపు 1% క్షీణించి ₹2,201.60 వద్ద ముగిసింది, 24 ఆగస్టు 2021 తర్వాత ఇదే కనిష్ట ముగింపు.
ఇవాళ (మంగళవారం, 21 మార్చి 2023) ఉదయం 9.55 గంటల సమయానికి 1.45% లాభంతో రూ. 2,233 వద్ద రిలయన్స్ షేర్ కదులుతోంది.
చవగ్గా దొరుకుతున్న రిలయన్స్ షేర్లు
ఇటీవలి ధర పతనంతో ఇప్పుడు ఈ స్టాక్ విలువ చౌకగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
2023లో ఇప్పటి వరకు (YTD), విదేశీ పెట్టుబడిదార్ల నిరంతర అమ్మకాల వల్ల నిఫ్టీ 6% పడితే, ఇదే సమయంలో ఈ స్టాక్ 14% క్షీణించింది.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 2022లోని నాలుగు త్రైమాసికాల్లో రిలయన్స్ షేర్లలో నెట్ సెల్లర్స్‌గా ఉన్నారు. 2021 డిసెంబర్‌లోని తమ వాటాను 24.75% నుంచి 2022 డిసెంబర్ చివరి నాటికి 23.48%కి తగ్గించారు. దీంతో, రిలయన్స్‌లో విదేశీ హోల్డింగ్ ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.
"FIIలు ఎక్కువగా కొన్న స్టాక్ ఇది. భారతదేశంలో కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల అమ్మకాల వల్ల ఇది ప్రతికూలంగా ప్రభావితం అవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లతో మేం మాట్లాడాం. స్టాక్ ధరను పైకి నడిపే కారణాలేమీ కనిపించడం లేవని వాళ్లు చెప్పారు. అందుకే అమ్మేస్తున్నారు" - జేపీ మోర్గాన్
రిలయన్స్‌ను మీద ఓవర్‌వెయిట్ రేటింగ్‌తో ఉన్న ఈ బ్రోకరేజ్, ధర లక్ష్యాన్ని ₹3,015 నుంచి ₹2,960 కి తగ్గించింది.
గత వారం, లార్జ్ క్యాప్ ఇండెక్స్‌లో రిలయన్స్ వెయిటేజీని FTSE రస్సెల్ గ్లోబల్ తగ్గించింది. ఫలితంగా ఈ స్టాక్ నుంచి $100 మిలియన్ల ఫారిన్ ఫండ్స్ బయటకు వెళ్లిపోయాయి.
ఇటీవలి దిద్దుబాటు తర్వాత, రిలయన్స్ ఒక ఇయర్ ఫార్వర్డ్ PE దాని ఐదేళ్ల సగటు 21.48 రెట్లుతో పోలిస్తే 17.61 రెట్ల వద్ద ఉంది. అంటే, ఈ స్టాక్ చవగ్గా మారిందని అర్ధం.
"ఇప్పటి స్టాక్ వాల్యుయేషన్ ఆకర్షణీయంగా ఉంది. బలమైన ఫండమెంటల్స్, వాల్యుయేషన్ సౌలభ్యం కారణంగా ఈ స్టాక్ తిరిగి బౌన్స్ అవుతుందని మేం ఆశిస్తున్నా" - ఆనంద్ రాఠీ
"సెల్ ఆన్ రైజ్" అవకాశం
"రిలయన్స్ ప్రస్తుతం ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉంది. ₹2,180-2,160 కనిష్ట స్థాయి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు ₹2,300-2,320 స్థాయిల వద్ద బలమైన ప్రతిఘటన (రెసిస్టెన్స్) ఎదుర్కొనే అవకాశం ఉంది, ₹2,100 స్థాయిలో కీలక మద్దతు ఉంది" - HDFC సెక్యూరిటీస్
₹2,300-2,320 స్థాయిల వద్ద రెసిస్టెన్స్‌ను "సెల్ ఆన్ రైజ్" అవకాశంగా చూడవచ్చని ట్రేడర్లకు HDFC సెక్యూరిటీస్ సూచించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.