Stock Market Holidays in April: మీరు షేర్ మార్కెట్‌లో ట్రేడ్‌ చేస్తుంటే ఈ వార్త మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. శ్రీరామ నవమి (Sri Ram Navami 2023) పండుగ సందర్భంగా, గత గురువారం (మార్చి 30) నాడు స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. వచ్చే వారంలోనూ (2023 ఏప్రిల్‌ 3-9 తేదీల మధ్య) మరో 4 రోజులు సెలవులు ఉన్నాయి. ఆ సెలవు రోజుల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) కార్యకలాపాలు జరగవు. అంటే, వచ్చే వారంలో కేవలం 3 రోజులు మాత్రమే ట్రేడింగ్‌ జరుగుతుంది. 


వచ్చే వారంలో ఏయే రోజుల్లో స్టాక్ మార్కెట్‌కు సెలవులు?
ఈ నెలలో, అంటే ఏప్రిల్‌లో స్టాక్‌ మార్కెట్లకు శని, ఆదివారాలు కాకుండా మరో 3 రోజులు ప్రత్యేక సెలవులు ఉన్నాయి. ఆ 3 రోజుల్లో రెండు సెలవు రోజులు వచ్చే వారంలోనే ఉన్నాయి. ఏప్రిల్ 4న (మంగళవారం) మహావీర్ జయంతి కారణంగా సెలవు. ఏప్రిల్ 7వ తేదీన (శుక్రవారం) గుడ్ ఫ్రైడే కారణంగా సెలవు. ఆ తర్వాత 8, 9 తేదీల్లో శని, ఆదివారాలు ఉన్నాయి. ఇవి సాధారణ సెలవు రోజులు. అంటే.. వచ్చే వారంలో సోమవారం (3వ తేదీ), బుధవారం ‍‌(5వ తేదీ), గురువారం ‍‌(6వ తేదీ) మాత్రమే ట్రేడింగ్‌ జరుగుతుంది. 


వచ్చే వారంలో కేవలం 3 రోజుల ట్రేడింగ్‌ ట్రేడింగ్‌ మాత్రమే మిగిలివుంది కాబట్టి, ఆప్షన్‌ ప్రీమియంల డికే చాలా వేగంగా ఉంటుంది. ఆప్షన్‌ ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరించడం మంచింది.


ఆ తర్వాత వచ్చే వారంలో, ఏప్రిల్ 14న (శుక్రవారం) డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి కారణంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు.


ఏప్రిల్‌ నెలలో వచ్చే 3 రోజుల ప్రత్యేక సెలవులు కాకుండా, 2023 సంవత్సరంలో మరో 9 రోజులు స్టాక్‌ మార్కెట్లు పని చేయవు. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులు వీటికి అదనం. ఏప్రిల్‌ తర్వాత... మే, జూన్‌ నెలల్లో కేవలం ఒక్కోరోజు చొప్పున ప్రత్యేక సెలవు రాగా, జులై నెలలో ఒక్క రోజు కూడా ప్రత్యేక సెలవు లేదు. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఒక్కోరోజు చొప్పున సెలవులు రాగా, అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో రెండు చొప్పున సెలవులు ఉన్నాయి. డిసెంబర్‌ నెలలో ఒక రోజు ప్రత్యేక సెలవు వచ్చింది. 


2023 సంవత్సరంలో ఏయే రోజుల్లో స్టాక్ మార్కెట్‌కు సెలవులు?


ఏప్రిల్ 4, 2023 - మహావీర్ జయంతి కారణంగా సెలవు
ఏప్రిల్ 7, 2023 - గుడ్ ఫ్రైడే కారణంగా సెలవు
ఏప్రిల్ 14, 2023 - అంబేద్కర్ జయంతి కారణంగా సెలవు
మే 1, 2023 - మహారాష్ట్ర దినోత్సవం కారణంగా సెలవు
జూన్ 28, 2023 - బక్రా ఈద్ కారణంగా సెలవు
ఆగస్ట్ 15, 2023 - స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు
సెప్టెంబర్ 19, 2023 - గణేష్ చతుర్థి కారణంగా సెలవు
అక్టోబర్ 2, 2023 - గాంధీ జయంతి కారణంగా సెలవు
అక్టోబర్ 24, 2023 - దసరా కారణంగా సెలవు
నవంబర్ 14, 2023 - దీపావళి కారణంగా సెలవు
నవంబర్ 27, 2023 - గురునానక్ జయంతి కారణంగా సెలవు
డిసెంబర్ 25, 2023 - క్రిస్మస్ కారణంగా సెలవు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.