అన్వేషించండి

Asha Bhosle Net Worth: సింగర్ మాత్రమే కాదు.. బిజినెస్ ద్వారా ఆశా భోంస్లేకు భారీగా ఆధాయం.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే

Asha Bhosle Death News: ప్రముఖ గాయని ఆశా భోంస్లే అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఆమె కన్నుమూశారు.

Asha Bhosle Passes Away | ముంబై: లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) మరణంతో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. స్వర కోకిల ఆశా భోంస్లే ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా భోంస్లే పాడిన పాటలు ఎప్పటికీ అభిమానులను పలకరిస్తూనే ఉంటాయి. ఆశా భోంస్లే కేవలం ఒక గొప్ప గాయని మాత్రమే కాదు, సక్సెస్‌ఫుల్ పారిశ్రామికవేత్త కూడా అన్న ముంబై వాసులకు తప్పా బయటివారికి అంతగా  తెలియకపోవచ్చు. ఆశా భోంస్లే వ్యాపారం, ఆమె ఆస్తుల విలువ ఎంత ఉంటుందోనని ఇక్కడ తెలుసుకుందాం.

అంతర్జాతీయ రెస్టారెంట్ చైన్

తన అద్భుతమైన గాత్రంతో కోట్లాది ప్రజల మనసు గెలిచిన ఆశా భోంస్లే వంటల పట్ల తనకున్న ఇస్టాన్ని ఒక విజయవంతమైన రెస్టారెంట్ బ్రాండ్‌గా మార్చారు. దానికి ఆమె తన పేరు Asha's Restaurant అని పెట్టారు. ఆమె మొదటి రెస్టారెంట్‌ను 2002లో దుబాయ్‌లోని వాఫీ సిటీ మాల్‌లో ఓపెన్ చేశారు. తరువాత ఈ వ్యాపారం అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ఈ రెస్టారెంట్ బ్రాంచులు దుబాయ్, అబుదాబి, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌లతో పాటు యూకేలోని బర్మింగ్‌హామ్,  మాంచెస్టర్ నగరాల్లో ఉన్నాయంటే ఆమె ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో తెలుపుతుంది.

ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటి ?

Ashas Restaurant వాయువ్య భారత వంటకాలతో త్వరగానే ప్రజాదరణ పొందింది. ఈ బ్రాండ్‌ను ఇతరుల కంటే భిన్నంగా నిలిపిన అంశం.. ఆశా భోంస్లే వ్యక్తిగతంగా రెస్టారెంట్ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. ఆమె సొంతంగా మెనూను సిద్ధం చేయడమే కాకుండా, వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులను కూడా ఎంపిక చేసేవారు. దీనివల్ల కస్టమర్లకు ఇంటి భోజనం తిన్న అనుభూతితో పాటు ప్రీమియం డైనింగ్ ఎక్స్‌పీరియన్స్ లభించేది. నేడు ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా డజనుకు పైగా రెస్టారెంట్లు ఉండగా.. ఇది ప్రతిష్టాత్మకమైన మిచెలిన్ గైడ్ (Michelin Guide) లో కూడా చోటు దక్కించుకుంది. 

ఆశా భోంస్లే ఆస్తుల విలువ ఎంత?
కేవలం రెస్టారెంట్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం గురించి చెప్పడానికి అధికారిక లెక్కలు అందుబాటులో లేవు. అయినప్పటికీ, రెస్టారెంట్ చైన్ ఆమెకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. పలు రిపోర్టుల ప్రకారం, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మొత్తం ఆస్తి విలువ దాదాపు 200 కోట్ల నుండి 250 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. ఈ ఆస్తిలో ఎక్కువ భాగం ఆమె గ్లోబల్ రెస్టారెంట్ బిజినెస్ ద్వారా సమకూరింది. దీనితో పాటు ఆమెకు మ్యూజిక్ రాయల్టీలు, కచేరీలు,  సినిమాల్లో ప్లేబ్యాక్ సింగింగ్ ద్వారా ఆదాయం లభించింది. 

కొన్ని నివేదికల ప్రకారం, 2012లో ఆమె తన బ్రాండ్‌ను విస్తరించడానికి సుమారు 2 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో భారత్‌లోనే ప్రారంభించిన వెంచర్లు కూడా ఉన్నాయి. దుబాయ్, కువైట్ సహా యూకే వంటి దేశాలలో ఆమె రెస్టారెంట్లు ప్రీమియం డైనింగ్ విభాగం కిందకు వస్తాయి. కనుక వీటిలో లాభాలు సైతం ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
Construction Ban: నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం-ఇందులో నిజమెంత?
నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం - ఇందులో నిజమెంత?
Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
Pagani Hypercars: డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!
డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget