Shares Buyback: ఇది రిజల్ట్స్ సీజన్ మాత్రమే కాదు, షేర్ల బైబ్యాక్ సీజన్ కూడా. Q1 FY24 ప్రోగ్రెస్ ప్రకటిస్తున్న కార్పొరేట్ కంపెనీలు, పనిలో పనిగా షేర్ బైబ్యాక్ లేదా షేర్ రీపర్చేజ్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి. షేర్ బైబ్యాక్ అనేది ఒక కార్పొరేట్ యాక్షన్. బహిరంగ మార్కెట్‌లో ఉన్న సొంత షేర్ల సంఖ్యను తగ్గించడానికి, ఆ కంపెనీయే స్వయంగా షేర్లను కొంటుంది. దీనివల్ల, పబ్లిక్ చేతుల్లో ఉన్న షేర్లతో పాటు సప్లై కూడా తగ్గిపోతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఫైనల్‌గా ఆ షేర్ల విలువ పెరిగే అవకాశం ఉంది. షేర్‌హోల్డర్లలో నమ్మకం పెంచడానికి కూడా షేర్ రీపర్చేజ్ ప్రోగ్రాం పెట్టుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు.
ఈ మధ్యకాలంలో షేర్ బైబ్యాక్ ప్రకటించిన కంపెనీలు:
ఇండియామార్ట్ ఇంటర్‌మెష్
ఆన్‌లైన్ B2B మార్కెట్ ప్లేస్ అయిన ఇండియామార్ట్ ఇంటర్‌మేష్ డైరెక్టర్ బోర్డు, షేర్ బైబ్యాక్ స్కీమ్‌కు ఈ నెల 20న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీ, ఒక్కో షేరుకు రూ. 4,000 చొప్పున, మొత్తం రూ. 500 కోట్ల విలువైన 12,50,000 షేర్లను కొంటుంది. టెండర్ రూట్‌లో బైబ్యాక్ జరుగుతుంది.
L&T
ఇంజినీరింగ్ మేజర్ కంపెనీ లార్సెన్ & టూబ్రో, ఈ నెల 25న షేర్ బైబ్యాక్ ప్రకటించింది. టెండర్ ఆఫర్ మార్గం ద్వారా రూ. 10,000 కోట్ల బైబ్యాక్ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసింది. ఒక్కో షేరుకు గరిష్టంగా రూ. 3,000 ధరతో జరిగే బైబ్యాక్‌లో 3.33 కోట్ల షేర్లను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటుంది. ఇది మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 2.4 శాతానికి సమానం.
BSE
BSE బోర్డు కూడా ఇటీవలే బైబ్యాక్ ప్రతిపాదనను ఆమోదించింది. ఈ కంపెనీ, 374 కోట్ల రూపాయల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఒక్కో షేర్‌కు బైబ్యాక్ ధరగా రూ. 816 నిర్ణయించింది.
ఆర్తి డ్రగ్స్
ఆర్తి డ్రగ్స్ 6,65,000 లక్షల ఈక్విటీ షేర్ల బైబ్యాక్ కోసం రూ. 59.85 కోట్లు కేటాయించింది. ఈ లిమిట్‌ను దాటకుండా సొంత షేర్లను తిరిగి కొంటుంది. ఈక్విటీ షేరుకు బైబ్యాక్ ధరగా రూ.900ను కంపెనీ నిర్ణయించింది. బైబ్యాక్ సైజ్ కంపెనీ మొత్తం ఈక్విటీలో 0.72 శాతానికి సమానం.
అమృతంజన్ హెల్త్ కేర్
జూన్ 30న, ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 900 ఆఫర్ ప్రైస్‌తో బైబ్యాక్ ప్లాన్‌ను అమృతాంజన్ హెల్త్ కేర్ డైరెక్టర్ల బోర్డ్ ఓకే చేసింది. మొత్తం బైబ్యాక్ ఆఫర్ సైజ్ రూ. 28.8 కోట్లు.
ఆషియానా హౌసింగ్
రూ. 55 కోట్లతో 18.27 లక్షల షేర్లను ఈ కంపెనీ తిరిగి కొనబోతోంది. టెండర్ ఆఫర్ రూట్‌లో మార్కెట్ నుంచి ఒక్కో షేరును రూ. 301 చొప్పున కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. ఈ నెల 28ని షేర్ల బైబ్యాక్‌కు రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. ఈ తేదీ నాటికి డీమ్యాట్ అకౌంట్స్‌లో షేర్లు ఉన్నవాళ్లు బైబ్యాక్‌లో పాల్గొనవచ్చు.
జేమ్స్ వారెన్ టీ
జేమ్స్ వారెన్ టీ బైబ్యాక్ ప్రోగ్రామ్ ఈ నెల 24న ప్రారంభమైంది, 28న ముగుస్తుంది. బైబ్యాక్ పరిమాణం రూ. 17.5 కోట్లు & బైబ్యాక్ ధర రూ. 250గా కంపెనీ నిర్ణయించింది. బైబ్యాక్ ఆఫర్ కంప్లీట్‌గా పూర్తయితే, కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ 70.34 శాతానికి పెరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఫారిన్ ఫండ్స్ Vs ఇండియన్ ఫండ్స్ - వీటి డీలింగ్స్ తెలిస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ ఈజీ అవుతుంది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial