తమకు తాము, తమ కుటుంబానికి ఇచ్చుకొనే అత్యంత గొప్ప బహుమతి లైఫ్‌ ఇన్సూరెన్స్‌! మీరు ఇప్పుడే కెరీర్‌ను ఆరంభిస్తున్నా, ఫైనాన్షియల్‌ గోల్స్‌ పెట్టుకుంటున్నా, రిటైర్మెంటుకు ప్లాన్‌ చేసుకుంటున్నా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడమే ఆర్థిక నిర్ణయాల్లో అత్యుత్తమమైంది. అందుకే ప్రతి భారతీయుడికి సబ్‌సే పెహలే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అన్నది ఒక నినాదంగా మారాలి.


జీవిత బీమాకు ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బీమా తక్కువగా తీసుకున్న దేశాల్లో భారత్‌ ఒకటి.  ఓ సర్వేలో 22-25 ఏళ్ల వయసు గల 12 వేల మంది ఇందులో భాగమయ్యారు. 8 మెట్రో నగరాలు, 9 టైర్‌ వన్‌ నగరాలు, 23 టైర్‌ 2 పట్టణాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 71 శాతం మంది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్న వారు లేదా తీసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారే కావడం ప్రత్యేకం.  'సబ్సే పెహలే లైఫ్‌ ఇన్సూరెన్స్‌' థీమ్‌తో 24 జీవిత బీమా కంపెనీల సంఘం ఈ సర్వే చేపట్టింది.


కొవిడ్‌ 19 పాండెమిక్‌ వల్ల ప్రజల్లో చాలామంది జీవిత బీమా తీసుకోవడం పెరిగింది. అయినప్పటికీ ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉంది. ఎందుకంటే 91 శాతం మంది బీమా ఓ అవసరంగా భావించిగా 70 శాతం మంది బీమాలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నారు. అన్ని రకాల ఆర్థిక పెట్టుబడి సాధనాల్లో 96 శాతం మందికి లైఫ్‌ ఇన్సూరెన్స్‌పై అవేర్‌నెస్‌ ఉంది. 63 శాతం మందికి మ్యూచువల్‌ ఫండ్స్‌, 39 శాతం మందికి ఈక్విటీ షేర్లపై అవగాహన ఉంది. అన్ని వయసుల్లోని స్త్రీలు, పురుషులు ఇన్సూరెన్స్‌ ప్రాముఖ్యాన్ని అంగీకరిస్తున్నారు. యువకులతో పోలిస్తే 36 ఏళ్ల వయసు పైబడ్డ వారికి బీమా ఉంటోంది.


సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది ఏజెంట్‌ ద్వారా బీమా తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రతి 10 మందిలో ముగ్గురు బ్యాంకుల్లో తీసుకోవాలని అనుకుంటున్నారు. యువత ఆన్‌లైన్‌లో బీమా తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేర్వేరు బీమాలను కంపేర్‌ చేసుకొంటున్నారు. చాలామంది తమ కుటుంబాల్లో ఎవరో ఒకరికి బీమా ఉందని చెప్పారు. చాలా మంది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తమకు అండగా ఉంటుందని, కుటుంబానికి రక్షణ కల్పిస్తుందని భావిస్తున్నారు. దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు బీమా ఆర్థిక భద్రత కల్పిస్తుందని నమ్ముతున్నారు.


జీవిత బీమాలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ముఖ్య కారణాలు


కుటుంబ భవిష్యత్తుకు భద్రత: భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరు. కానీ మీరు మెరుగైన ఫ్యూచర్‌కు ప్రిపేర్‌ అయితే మిగతాదంతా సులభంగా ఉంటుంది. మీ పిల్లల చదువులు, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. మీపై ఆధారపడిన వారికి అండగా ఉంటుంది.


దీర్ఘ కాల లక్ష్యాలు: జీవిత బీమా పాలసీలు పెట్టుబడి పరంగా వైవిధ్యతను తీసుకొస్తాయి. దీర్ఘ కాల ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు మంచి రిటర్నులను ఇస్తాయి. రిటైర్‌మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకొనేందుకు సాయపడతాయి. కొన్నిసార్లు బీమా పథకాల్లో కవరేజీ, ఇన్వెస్టుమెంటును మార్చుకొనే ఫ్లెక్సిబిలిటీని ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇస్తున్నాయి. 


రిటైర్మెంట్‌ నిధికి తోడు: చాలా మందికి రిటైర్మెంటు తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందోనని బెంగపడతారు. అందుకే సరైన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకుంటే మీకు భద్రత దొరుకుతుంది. యాన్యుటి లేదా పింఛను పథకాల ద్వారా నెలవారీ ఆదాయం పొందొచ్చు.


పన్ను ఆదా ప్రయోజనాలు: ఇన్సూరెన్స్‌ పాలసీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆదాయపన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. మీరు చెల్లించే ప్రీమియానికి రూ.1.5 లక్షల వరకు సెక్షన్‌ 80సి కింద మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో పన్నులు పడవు.


డబ్బు ఆదా చేయడం: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వల్ల పన్ను ప్రయోజనాలు పొందడమే కాకుండా డబ్బు ఆదా చేసేందుకు ఇదో టూల్‌గా ఉపయోగపడుతుందని మీరు గ్రహిస్తారు. పైగా మీకు అవసరమైనప్పుడు పాలసీపై రుణం తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.


'భారతీయుల కుటుంబాల్లో ప్రతి సంపాదనా పరుడు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొనేలా చేయడమే మా లక్ష్యం. వారి కుటుంబాల భవిష్యత్తుకు అండగా నిలవడమే మాకు ముఖ్యం. జీవిత బీమా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ అవగాహన కల్పిస్తాం' అని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ జనరల్‌ ఎస్‌ఎన్‌ భట్టాచార్య అన్నారు.


మీకు ఎంత జీవిత బీమా అవసరమో తెలుసుకోవాలని ఉందా? మీ ఉద్యోగం, మీపై ఆధారపడ్డ వాళ్లు, మీ లైఫ్‌స్టైల్‌ను బట్టి ఇది ఉంటుంది. మీ దగ్గర్లోని ఇన్సూరెన్స్ ఏజెంట్‌ లేదా ఆర్థిక సలహాదారులను కలిస్తే మీరు ఎంత తీసుకోవాలో చెబుతారు. ఏదేమైనా సరే లైఫ్‌ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. కుటుంబానికి దన్నుగా నిలిచామన్న ధైర్యం ఉంటుంది.


లైఫ్‌ ఇన్సూరెన్స్‌ గురించి తెలుసుకొనేందుకు sabsepehlelifeins.com క్లిక్‌ చేయండి.


Disclaimer: This is sponsered feature and provided by "Sabse pehle life insurance"