Petro-Diesel Price, 18 August: పెట్రోల్, డీజిల్ ధరలు అనగానే సామాన్యుల గుండెలపై రైళ్లు పరుగెడుతున్నాయి. ఎన్నడూ లేని రీతిలో కొద్ది రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆ క్రమంలో పెట్రోల్ లీటరుకు రూ.120 దాటేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించగా, ప్రస్తుతం పెట్రోల్ రూ.110, డీజిల్ రూ.100 కు అటు ఇటుగా ఉంటున్నాయి. అయితే కొన్ని రోజులుగా మెట్రో సిటీల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అటు తగ్గడం లేదు, ఇటు పెరగడం లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. 


తెలంగాణలో ధరలు ఎలా ఉన్నాయంటే..



  • హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు నెలలుగా ఎలాంటి పెరుగుదల లేకుండా ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 109.66 గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.

  • వరంగల్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 109.10, లీటరు డీజిల్ ధర రూ.97.29 గా ఉంది. కరీంనగర్ లో లీటరు పెట్రోల్ పై రూ. 0.31 పైసలు తగ్గింది. ప్రస్తతం లీటరు పెట్రోల్ ధర రూ. 109.47 గా ఉంది. డీజిల్ ధర రూ.0.29 పైసలు తగ్గింది. ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ. 97.63గా ఉంది. నిజామాబాద్ లో పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గి, రూ.111.27 వద్ద కొనసాగుతోంది. డీజిల్ పైనా రూ.0.17 పైసలు తగ్గి, రూ. 99.31 వద్ద కొనసాగుతోంది.


ఆంధ్రప్రదేశ్ లో ఇంధన ధరలు



  • విజయవాడలో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.55 పైసలు తగ్గి రూ.110.97 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ. 0.51 పైసలు తగ్గింది. ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ.98.76 గా ఉంది. 

  • విశాఖపట్నంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. లీటరు పెట్రోల్ రూ.110.48 గా ఉండగా, లీటరు డీజిల్ రూ. 98.27గా ఉంది.  

  • తిరుపతిలో పెట్రోల్, డీజిల్ ధరలు..
    తిరుపతిలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ రూ.0.39 పైసలు పెరగ్గా.. డీజిల్ రూ. 0.37 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ. 111.96గా ఉంది. లీటరు డీజిల్ రూ.100.01 గా ఉంది. 


ధరలు ఎందుకింత పెరుగుతున్నాయంటే..?


పెట్రోల్, డీజిల్ ఎప్పుడూ లేనంత ఎక్కువ ధర వద్ద కొనసాగుతున్నాయి. గత సంవత్సరం నుండి పెట్రోల్, డీజిల్ భారీగా పెరిగి సామాన్యులపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, దేశంలో మాత్రం ధరలు ఆకాశంలోనే ఉంటూ వచ్చాయి. క్రూడాయిల్ ధరలు తగ్గినా, ఆ మేరకు దేశంలో ధరలు తగ్గకుండా, పన్నులు పెంచుతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోవడం మిగతా రంగాలపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. వంట నూనె దొరకని పరిస్థితి తలెత్తింది. ద్రవ్యోల్బణం నానాటికీ పెరగడంతో.. అనివార్యంగా కేంద్రం కొంత ధరలను తగ్గించాల్సి వచ్చింది. అలా కొంత తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు ధరలు తగ్గించాయి. అయితే చాలా రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపుగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి.