By: ABP Desam | Updated at : 30 Oct 2021 07:42 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో వ్యత్యాసం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో వరుసగా మళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగి రూ.113.00గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.38 పైసలు పెరిగి రూ.106.22గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.39 పైసలు పెరిగి రూ.112.54 అయింది. డీజిల్ ధర రూ.0.40 పైసలు పెరిగి రూ.105.78 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.19 పైసలు పెరిగి.. రూ.112.95గా ఉంది. డీజిల్ ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.106.17 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.11 పైసలు పెరిగి రూ.114.46 గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.107.58 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం రూ.115.27 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.08 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.0.01 పైసలు తగ్గి రూ.107.86కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తగ్గాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.114.57గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.95 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.107.15గా ఉంది. ఇది లీటరుకు రూ.0.91 చొప్పున పెరిగింది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.40 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.05 పైసలు పెరిగి.. రూ.115.59 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.108.10గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.08 పైసలు పెరిగింది.
Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 30 నాటి ధరల ప్రకారం 83.57 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర, వెండి కూడా.. మీ ప్రాంతంలో తాజా ధరలివే..
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!
Gold-Silver Price Today 06 June 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!
Cryptocurrency Prices: మిక్స్‌డ్ జోన్లో క్రిప్టో కరెన్సీ - రూ.15వేలు తగ్గిన బిట్‌కాయిన్!
Aakash IPO: బైజూస్ ఆకాశ్ ఐపీవో తేదీ మార్పు! వచ్చే ఏడాదికి మార్చిన బోర్డు!
Stock Market News: బుల్‌రన్ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం